కల్కి కూడ షాక్ ఇవ్వబోతోందా ?

Seetha Sailaja
ఈసమ్మర్ రేస్ కు ‘దేవర’ తో మొదలైన భారీ సినిమాల హంగామా ‘పుష్ప 2’ వరకు కొనసాగుతుంది అని ఆశపడ్డ టాప్ హీరోల అభిమానులకు వరసపెట్టి చాల భారీ సినిమాలు రకరకాల కారణాలతో వాయిదా పడుతూ ఉండటంతో టాప్ హీరోల అభిమానులు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రియల్ లో విడుదలకావలసి ఉన్న ‘దేవర’ ను అక్టోబర్ కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ కూడ సమ్మర్ రేస్ నుండి తప్పుకుంది. దీనితో ప్రభాస్ నటిస్తున్న భారీ మూవీ ప్రాజెక్ట్ ‘కల్కి 2898’ అయినా అనుకున్న తేదీకి మే నెలలో విడుదల అవుతుంది అని భావించిన ప్రభాస్ అభిమానులకు నిరాశ మిగలవచ్చు అన్నసంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ షూటింగ్ ఇంకా పూర్తి అవ్వకపోవడంతో పాటు ఈమూవీకి సంబంధించిన గ్రాఫిక్ పనులు కూడ చాల స్లోగా నడుస్తున్న పరిస్తుతులలో ఈమూవీని కూడ ఈ సంవత్సరం సమ్మర్ రేస్ నుండి తప్పించే ఆస్కారం ఉంది అని అంటున్నారు.

శంకర్ దర్శకత్వం వహిస్తున్న కమలహాసన్ మూవీ ‘ఇండియన్ 2’ కూడ సమ్మర్ రేస్ నుండి తప్పుకునే ఆస్కారం ఉంది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ పనులు చాల నెమ్మదిగా జరుగుతూ ఉండటం వల్ల ఈమూవీ కూడ సమ్మర్ రేస్ నుండి తప్పుకునే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో టాప్ హీరోల సినిమాల వార్ కు ఆగష్టు 15న విడుదల కాబోతున్న ‘పుష్ప 2’ నుండి కౌంట్ డౌన్ మొదలవుతుంది అనుకోవాలి.

ఈమూవీ కూడ అనుకున్న తేదీకి విడుదల అవ్వకపోవచ్చనీ కొన్ని వారాలుగా మీడియాలో గాసిప్పుల హడావిడి జరుగుతోంది. అయితే ఈవార్తలను సుకుమార్ ఖండిస్తున్నప్పటికీ చాలమందిలో ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ విషయమై సందేహాలు ఉన్నాయి. ఇలా సమ్మర్ రేస్ కు రావలసి ఉన్న సినిమాలు అన్నీ వాయిదా పడితే ఈసంవత్సరం సమ్మర్ రేస్ ఎటువంటి సౌండ్ లేకుండా చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలతో సరిపెట్టుకోవలసి వస్తుంది అనుకోవాలి..      


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: