"ఈగల్" మూవీకి 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపరర్ హీరోయిన్ లుగా రూపొందిన ఈగల్ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఈ మూవీ కి 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజం ఏరియాలో 4.74 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.98 కోట్లు ... ఉత్త రాంధ్రలో 1.86 కోట్లు , ఈస్ట్ లో 1.19 కోట్లు , వెస్ట్ లో 72 లక్షలు , గుంటూరు లో 1.16 కోట్లు , కృష్ణ లో 80 లక్షలు , నెల్లూరు లో 58 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి అయ్యే సరికి ఈగల్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.03 కోట్ల షేర్ ... 23.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమాకి 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.46 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 1.53 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకి 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 16.02 కోట్ల షేర్ ... 29.90 కోట్ల క్లాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 5.98 కోట్ల షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబటినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మలా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ లో 73 శాతం కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: