"సైంధవ్" మూవీ వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందినటువంటి సైంధవ్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ఏన్ని కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 2.67 కోట్ల కలెక్షన్ లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.17 కోట్లు , ఉత్తరాంధ్ర లో 1.72 , ఈస్ట్ లో 91 లక్షలు , వెస్ట్ లో 49 లక్షలు , గుంటూరు లో 76 లక్షలు , కృష్ణ లో 74 లక్షలు , నెల్లూరు లో 34 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 8.80 కోట్ల షేర్ , 15.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 53 లక్షలు , ఓవర్ సీస్ లో 1.02 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10.35 కోట్ల షేర్ , 19.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , 26 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రన్ క్లోజ్ అయ్యే సరికి 15.65 కోట్ల నష్టాలను అందుకొని భారీ అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: