పూజా హెగ్డే అలా కూడా రెడీ..!

shami
టాలీవుడ్ లో తనకు తిరుగులేని క్రియ సంపాదించుకున్న పూజా హెగ్డే ఉన్నఫలంగా అవకాశాలు ఏమీ లేకుండా అవ్వడంతో ఏం చేయాలో తోచట్లేదు అనుకుంటా అందుకే అమ్మడు రోజుకు ఫోటోషూట్ తో ప్రేక్షకుల్ని ఎలా వస్తుంది. తెలుగులో ఆఫర్స్ లేవు కదా బాలీవుడ్ లో సినిమాలు చేద్దామనుకున్నా అమ్మడికి అక్కడ అవకాశం లేవు. ఎలాగైనా సరే మళ్లీ తెలుగులో తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తుంది పూజా హెగ్డే.
అందుకే ఇక్కడ దర్శక నిర్మాతల కోసం ఒక బంపర్ ఆఫర్ ఇస్తుంది. నిన్న మొన్నటిదాకా సినిమాకు భార్య రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిన పూజా హెగ్డే ఇప్పుడు పార్థోత్సవం గురించి పెద్దగా పట్టించుకోవద్దని చెబుతుందట. అంతేకాదు అంతకుముందు తనకు ఇచ్చిన రెండు మూడు కోట్ల రెమ్యూనరేషన్ కూడా ఇప్పుడు వద్దంటుందట. అవకాశాల కోసం తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుంది బుట్ట బొమ్మ.
మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా చేయాల్సిన అమ్ముడు ఆ సినిమా నుండి తప్పుకోవడమే పెద్ద చిక్కు వచ్చి పడినట్టు అయింది. ఆ తర్వాత అమ్మడికి తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. పూజా హెగ్డేని దూరం పెట్టడంలో టాలీవుడ్ రీజన్ ఏమో కానీ ఆమె సినిమాల్లో చేస్తే గ్లామర్ విషయంలో ఎలాంటి డోకా ఉండదని భావించే ఆడియన్స్ మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. లేటెస్ట్ గా శారీ లుక్ లో పూజ హెగ్డే అదుర్స్ అనిపిస్తుండగా ఈ ఫోటో షూట్స్ చూసైనా సరే అమ్మడికి ఎవరైనా అవకాశం ఇస్తే బాగుండని ఫాన్స్ కోరుతున్నారు. బాలీవుడ్ లో కూడా పూజాకి పెద్దగా అవకాశాలు లేవు అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఒకేసారి కెరీర్ లో ఈ బ్రేక్ రావడం పూజాకి షాక్ ఇస్తుంది. మరి రానున్న రోజుల్లో అయినా పూజా బేబికి అవకాశాలు వస్తాయేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: