ఏంటి.. యాంకర్ రష్మీ సీరియల్స్ లో కూడా నటించిందా..!?

Anilkumar
బుల్లితెర యాంకర్ రష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన రష్మి.. సినిమాల్లో సరైన అవకాశాలు దొరక్కపోవడంతో బుల్లితెర మీద యాంకర్ అవతారం ఎత్తింది. జబర్థస్త్ షోలో యాంకర్‌గా కనిపించిన తరువాత రష్మి జాతకమే మారిపోయింది. జబర్థస్త్ షో రష్మికి ఫుల్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా రష్మి -సుడిగాలి సుధీర్‌ల మధ్య కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. టీవీ రంగంలో రష్మి -సుడిగాలి సుధీర్‌లపెయిర్ సంచలనం సృష్టించారని అని చెప్పాలి. వీరిద్దరూ కలిసి కనిపిస్తే చాలు ఆ షో సూపర్ హిట్ అనే రేంజ్‌కి వెళ్లిపోయిందంటే

వీరి క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మి పలు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా అవకాశాలు దక్కించుకుంది. యాంకర్ రష్మి జబర్దస్త్ శ్రీదేవీ డ్రామా కంపెనీ, పండుగ ఈవెంట్లు అంటూ బాగానే బిజీగా ఉంటోంది. ఇప్పుడు సుధీర్ రష్మీ ట్రాక్ గురించి జనాలు మాట్లాడుకోవడం తగ్గించేశారు. ఒకప్పుడు బుల్లితెరపై ఇదే హాట్ టాపిక్‌గా ఉండేది. కానీ సుధీర్ తెరపై హీరో అంటూ బిజీగా మారడంతో రష్మీ సుధీర్ టాపిక్ బుల్లితెరపై తగ్గింది. సుధీర్ వెండితెరపై, రష్మి బుల్లితెరపై ఫిక్స్ అయ్యారు. రష్మీ మొదట్లో పలు సీరియల్స్ లో,

థాంక్స్ లాంటి రొమాంటిక్ సినిమాలో నటించిన ఆమెకు పెద్దగా క్రేజ్ రాలేదని.. పైగా అందులో పాత్రల కారణంగా తనపై ఎన్నో ట్రోల్స్, విమర్శలు వినిపించాయని.. ఆఫర్లు కూడా రాలేదంటూ వివరించింది. దాంతో ఆమె ఇంటికి వెళ్ళిపోయిందట. ఆ తర్వాత మళ్లీ కొంత గ్యాప్ తో ఎంట్రీ ఇచ్చి యువ అనే సీరియల్ లో నటించే ఆఫర్ అందుకుంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ సీరియల్ మాటీవీలో ప్రసారమయ్యేదని వివరించింది. ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్న చాలామంది అందులో నటించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: