రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాని రిజెక్ట్ చేసిన సీనియర్ నటుడు?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టు తర్వాత రామ్ చరణ్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్నాడు చరణ్. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లబోతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాని ఓ సీనియర్ నటుడు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

'RC16' ప్రాజెక్టులో నటించే నటీనటుల విషయంలో రోజుకో పేరు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కోసం పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తిని  సంప్రదించారట. సినిమాలో ఆ పాత్ర ఎంతో కీలకం కావడంతో ఆ పాత్రకి నారాయణమూర్తి అయితేనే సరిగ్గా సూట్ అవుతారని బుచ్చిబాబు ఇటీవలే ఆయన్ని వెళ్లి కలిశారట. కానీ ఆర్.నారాయణమూర్తి బుచ్చిబాబు ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది.
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఇప్పటి వరకు క్యారెక్టర్ రోల్స్ చేసింది లేదు. గతంలో పూరి జగన్నాథ్ - ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'టెంపర్' సినిమా కోసం ఆర్. నారాయణమూర్తిని అనుకున్నారు. పూరి జగన్నాథ్ స్వయంగా ఆయన్ని కలిసి తన పాత్రకు సంబంధించి నెరేషన్ కూడా ఇచ్చారు. కానీ అప్పటికీ ఆయన అంగీకరించకపోవడంతో చివరికి ఆ పాత్ర పోసాని కృష్ణ మురళి దగ్గరికి వెళ్ళింది. 'టెంపర్' లో పోసాని పాత్రకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. అప్పుడు ఎన్టీఆర్ సినిమాని ఎలా రిజెక్ట్ చేశాడో ఇప్పుడు రామ్ చరణ్ సినిమాని కూడా నారాయణమూర్తి అలాగే రిజెక్ట్ చేయడం గమనార్హం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: