భార్య, భర్త అన్నాక గొడవలు సహజం : ప్రియమణి

Anilkumar
సీనియర్ హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన 'భామా కలాపం' అనే వెబ్ మూవీ ఆహా ఓటీటీలో ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. 2022 లో వచ్చిన ఈ క్రైం థ్రిల్లర్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా 'భామాకలాపం 2'ను తీసుకువస్తున్నారు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సీక్వెల్ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా 'భామాకలాపం 2' ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ వెబ్‌ మూవీ ట్రైలర్‌ను ఆహా విడుదల చేసింది. ఈ క్రమంలోనే భామాకలాపం 2 ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొంది

 ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. 2003 నుంచి 2024 వరకు మీ గ్లామర్ ని అలాగే మైంటైన్ చేస్తున్నారు, దాని వెనుక సీక్రెట్ ఏంటి? అని రిపోర్టర్ అడగ్గా, అందుకు ప్రియమణి బదులిస్తూ.." హ్యాపీ పీపుల్ తో ఎక్కువగా కలవడం, ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉండడం, పాజిటివ్ వైబ్స్.. ఇవే నా గ్లామర్ సీక్రెట్" అని చెప్పింది. " నేను భర్తకు భయపడతాను, అదే సమయంలో భయపెడతాను. అంటే వైలెన్స్ అని కాదు. కొన్ని సందర్భాల్లో భర్త మన మాట వినాలి, మనం కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి. ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట. అయినా భార్య భర్త అన్నాక గొడవలు సాధారణం" అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ నాకు ఆఫర్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగులో మాత్రమే కాకుండా అన్ని లాంగ్వేజెస్ లో చాలామంది ఆఫర్స్ ఇస్తున్నారు. చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఓటీపీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇప్పటికీ నాకు వరుస ఆఫర్స్ వస్తుండడం అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్లు కూడా నా మీద నమ్మకం పెట్టి కాల్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఫిలిం మేకర్స్ వ్యూ పాయింట్ కూడా చేంజ్ అయింది. ఒకప్పుడు పెళ్లయిన తర్వాత హీరోయిన్లు ఫిలిం కెరీర్ కన్నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి అయినా అవ్వకపోయినా ఇండస్ట్రీ, ఆడియన్స్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటికీ అలాగే ఉంది.అంటూ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: