వావ్: పుట్టినరోజున ఫుడ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి భార్య..!!

Divya
మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా తన భార్య కు చిరంజీవి ప్రత్యేకమైన విషెస్ తెలియజేస్తూ.. ఒక కవితను చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు చిరంజీవి.. "నా జీవన రేఖ నా సౌభాగ్యరేఖ నా భాగస్వామి సురేఖ" అంటూ ఆమెకు బర్తడే విషెస్ ను వెరైటీగా తెలియజేశారు. ప్రస్తుతం అమెరికా ట్రిప్పులో ఉన్న చిరంజీవి భార్య పుట్టినరోజు కోసమే ఈ ట్రిప్పు ప్లాన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మెగా కోడలు ఉపాసన తమ అత్తమ్మ సురేఖ బర్తడే కు స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది.

అత్తమ్మస్ కిచెన్  పేరుతో జాయింట్ ఆన్లైన్ బిజినెస్ ని కూడా ప్రారంభించారు. ఇది రెడీ టు ఈట్ ఫుడ్ బిజినెస్ అన్నట్టుగా ఉపాసన స్వయంగా తెలియజేయడం జరిగింది. తమ అత్తమ్మ పుట్టినరోజు సందర్భంగా మా వ్యవస్థాపకు వెంచర్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపింది. రుచికి రుచి వంటశాలలో వీటిని నిర్మిస్తున్నామంటూ ఇప్పుడు మా వంట గది నుండి మీ వద్దకు రెడీ మిక్స్ రూపంలో కొన్ని ఆహార ప్రాజెక్టులు కూడా వస్తాయని వీటిని మీ ఇంటిల్లి పాది తింటూ ఆస్వాదించండి అంటూ తెలియజేసింది..

Athammaskitchen.com అనే వెబ్సైట్లో తీసుకోవాలంటే తెలిపారు. ప్రస్తుతం ఉప్మా ,పొంగల్, పులిహోర, రసం ఈ నాలుగు ఉత్పత్తులను సైతం సేల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ.1099 రూపాయలుగా ఆన్లైన్లో డబ్బులు చెల్లించి పొందవచ్చు అంటూ తెలిపింది. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా తమ ఆహార ఉత్పత్తులను సైతం అందిస్తామంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఉపాసన ఒక వీడియో ద్వారా తెలియజేసింది. చిరంజీవి సతీమణి సురేఖ చేతి వంటలు తినడానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ తెలిపింది చిరంజీవి తల్లి అంజనమ్మ సురేఖతో సహా వారి కుటుంబంలో చాలామంది వంట నైపుణ్యంలో ప్రసిద్ధి చెందిన వారేనట. ఆహార ప్రియులకు మెగా ఫ్యామిలీ నుంచి అందించే ఈ రుచులపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: