సౌందర్య మరణించే ముందు ప్రెగ్నెంట్..అసలు విషయం చెప్పిన డైరెక్టర్..!
.తాజాగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఆర్యీ ఉదయ్ కుమార్ సౌందర్య తో తనకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ పలు విషయాలను తెలిపారు. నిజానికి సినీ రంగానికి సౌందర్యాన్ని నటిగా పరిచయం చేసింది ఈయనే. సౌందర్య గురించి మాట్లాడుతూ సినిమా ప్రపంచంలో సౌందర్య లాంటి అద్భుతమైన నటిని తాను ఇంతవరకు చూడలేదని సంవత్సరానికి 10 సినిమాలలో నటించే ఆమె ఎప్పుడూ కూడా స్టార్ అనే ఒక యాటిట్యూడ్ ఎక్కడా చూపించలేదని తెలిపారు.
రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమాకి ముందు సౌందర్య కాల్ షీట్స్ లేనంత బిజీ హీరోయిన్గా మారిపోయిందని అయినా కూడా అందరిని చాలా చక్కగానే మాట్లాడిచ్చేదని తెలిపారు. సౌందర్య మరణించడానికి రెండు రోజుల ముందు 2004 ఏప్రిల్ 15న తన భార్య సుజాతకు కాల్ చేసిందని తెలిపారు డైరెక్టర్. అయితే ఆ సమయంలో సౌందర్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని కూడా చెప్పిందని తెలిపారు. అలా తనతో కూడా కొద్దిసేపు మాట్లాడి ప్రచారానికి వెళ్లొచ్చి అలసిపోయాను, అయిపోయిన తర్వాత కలుస్తానని ఫోన్ పెట్టేసిందని తెలిపారు డైరెక్టర్ ఆర్వీ. ఆ తర్వాత కొన్ని గంటలకి నటుడు సత్యరాజ్ సార్ వచ్చి తనకు సౌందర్య మరణించిందనే విషయాన్ని చెప్పారని ఆమె మరణ వార్త తాను నమ్మలేకపోయాను అంటూ తెలియజేశారు.