నెటిజన్స్ చేత కన్నీళ్లు పెట్టించిన బ్రహ్మానందం.....!!
అలా పాత్రల్లో ఇమిడిపోయి మెప్పించిన మహా నటులు చాలా మంది ఉన్నారు. అలాంటి గొప్ప నటుల్లో బ్రహ్మానందం ఒకరు. కన్నెగంటి బ్రహ్మానందం కమెడియన్ గా ఎన్నో వందల ల్లో నటించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్ తో పాటు.. చిత్రవిచిత్ర హావభావాలు పలికిస్తూ నవ్వులు పూయించారు ఈ హాస్య బ్రహ్మ. ఆహా నా పెళ్ళంట తో కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ కింగ్ గా నిలిచారు. ఒకప్పుడు లో నవ్వులు పుస్తున్నాయ్ అంటే అక్కడ ఖచ్చితంగా బ్రహ్మానందం ఉంటారు.కేవలం బ్రహ్మానందం కోసం లకు వెళ్లే వారు కూడా ఉన్నారు. అప్పటి ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇప్పటి జనరేషన్ కూడా బ్రహ్మానందం ఫెవరెట్ యాక్టర్. ఇప్పుడొస్తున్న ల్లో హీరోలే కామెడీలు చేస్తుండటంతో కమెడియన్స్ కు చోటు దక్కడం లేదు కానీ.. ఇప్పుడు కూడా ప్రతి లో బ్రహ్మానందం కనిపించే వారు. బ్రహ్మానందం అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు.. తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు కూడా తెపిస్తారు ఈ మహానటుడు.
సీరియస్ పాత్రల్లోనూ ఇమిడిపోయి ఆ సీన్స్ ను రక్తికట్టిస్తారు బ్రహ్మానందం. ఇటీవలే కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ లో ఆయన నటన చూస్తే.. అబ్బా.! ఎంత బాగా చేశారు అని అనకుండా ఉండలేము. ముఖ్యంగా హాస్పటల్ బెడ్ పై ఉండగా ప్రకాష్ రాజ్ తో మహాభారతం డైలాగ్ చెప్తుంటే.. రోమాలు నిక్కపొడుచుకుంటాయి.. అంతటి గొప్ప నటుడు డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం. తాజాగా ఆయనకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక స్టేజ్ పై బ్రహ్మానందం చేసిన యాక్టింగ్ నెటిజన్స్ చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. ఓ మతిస్థిమితం సరిగ్గా లేని బాలుడు తండ్రి దగ్గర దెబ్బలు తింటూ సంజాయిషీ ఇస్తున్నట్టు నటించి ఏడిపించారు బ్రహ్మానందం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి నటుడుకి ఎన్ని దండాలు పెట్టిన తక్కువే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.