ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన జాతీయ ఉత్తమ నటి....!!

murali krishna
ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది ప్రియమణి. అద్భుతమైన పాత్రలతో మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా నటిగా రాణిస్తుంది.ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా, ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్ లో పాన్‌ ఇండియా నటిగా రాణిస్తుంది. ఇండియన్‌ ఆడియెన్స్ ని మెప్పిస్తుంది. ప్రస్తుతం ఆమె భామ కలాపం2`తో రాబోతుంది. ఇటీవల ఈ వెబ్‌ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ఆకట్టుకుంటుంది. గతంలో వచ్చిన `భామ కలాపం వెబ్‌ సిరీస్‌ వచ్చి మంచి ఆదరణ పొందింది. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించింది ప్రియమణి. అందులో భాగంగా ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగులో పెద్ద హీరోలతో సినిమాలు చేయకపోవడంపై ఆమె రియాక్ట్ అయ్యింది. తమిళంలో, కన్నడ, మలయాళంలో పెద్ద హీరోలతో సినిమాలు చేశారు. కానీ తెలుగులో ఎందుకు చేయలేదని యాంకర్‌ ప్రశ్నించగా ప్రియమణి స్పందించింది. తాను అందరితో పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నానని తెలిపింది. పెద్ద హీరోలతోనూ సినిమాలు చేస్తానని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపింది. అయితే అలాంటి ఆఫర్లు తనకు రావడం లేదని పేర్కొంది. రాజమౌళి సర్‌తోనూ పనిచేయాలని ఉందని, గతంలో పనిచేశానని, మున్ముందు కూడా ఆయనతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. మంచి ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పింది ప్రియమణి. వాళ్లు పిలిస్తే కచ్చితంగా సినిమాలు చేస్తానని పేర్కొంది. అదే సమయంలో స్క్రిప్ట్ నచ్చాలని కూడా చెప్పడం కొసమెరుపు. నచ్చే సినిమాలు, పాత్రలే చేస్తానని ఆమె వెల్లడిచింది. ఇక ప్రియమణి గతంలో `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`లో నటించింది. ఇప్పుడు సీజన్‌ 3లోనూ ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఆమె సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు `భామ కలాపం`2`తో రాబోతుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. కిచెన్‌ ప్రధానంగా సాగే సిరీస్‌ ఇది. ఒక మధ్యతరగతి మహిళ కిచెన్‌లో వెరైటీస్‌ చేస్తూ పాపులర్‌ అవుతుంది. దీంతో యూట్యూబ్‌ చానెల్‌ పెట్టి ఫేమస్‌ అవుతుంది. దాని ద్వారా ఆమె హోటల్ కూడా స్థాపిస్తుంది. ఆమె వంటకాలు బెస్ట్ ప్రైజ్‌ కూడా వస్తుంది.ఈ క్రమంలో ఆమె ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటుంది. మరి దాన్నుంచి బయటపడేందుకు ఆమె ఏం చేసింది? ప్రియమణి ఇందులో ఒక్కరా? ఇద్దరా? ఆమెలోని మరో కోణం ఏంటనేది ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. గురువారం రాత్రి నుంచే ఇది `ఆహా`లో స్ట్రీమింగ్‌ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: