సినిమా రివ్యూ: భామా కలాపం 2

Chakravarthi Kalyan
2022లో విడుదల అయి బ్లాక్‌బస్టర్ అయిన ‘భామాకలాపం’కి సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ తెరకెక్కింది. ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదలైన ఈ సినిమాను  హెయిస్ట్ థ్రిల్లర్‌గా తీశారు.

కథ: గతంలో వచ్చి మంచి ప్రేక్షకదరణ పొందిన మొదటి భాగం పూర్తయిన దగ్గర నుంచే ఈ భాగం స్టార్ట్ అవుతుంది. కొత్త ఇంటికి మారిపోయిన తర్వాత అనుపమ (ప్రియమణి) జీవితం ఇంకా ఆనందంగా మారుతుంది. యూట్యూబ్‌లో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్ మార్కును దాటతారు. పాత ఇంట్లో పని మనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) పార్ట్‌నర్‌గా ‘అనుపమ ఘుమఘుమ’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభించి  కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవల్ కుకింగ్ కాంపిటీషన్‌కు వెళ్తారు. ఆంథోని లోబో (అనూజ్ గుర్వారా) అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ పేరుతో యూరప్ నుంచి డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేసేందుకు ప్లాన్ చేస్తాడు. తనను హీరోయిన్ చేస్తాడనే ఆశతో జుబేదా (సీరత్ కపూర్) ఐదేళ్లుగా ఆంథోని లోబోతో ఉంటూ వస్తుంది. ఈ డ్రగ్స్‌ను కొట్టేయాల్సిన పరిస్థితి అనుపమకు ఎందుకు వస్తుంది? ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:  ‘భామా కలాపం’ మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్‌ జోనర్‌ వేరు. మొదటి భాగం మర్డర్ మిస్టరీ.. రెండో భాగం హెయిస్ట్ థ్రిల్లర్. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. అనుపమ కథ, ట్రోఫీ కథ, మరో పోలీసాఫీసర్ కథ సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. ఈ మూడు కథలిన చోట నుంచి వేగం పెరుగుతుంది. ఈ సినిమాకు అతి పెద్ద ప్లస్ పాయింట్ ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల మధ్య కెమిస్ట్రీనే. బయట నుంచి ఒకరు ఉండి టీమ్‌ను నడిపించడం, లోపల వాళ్లు దొంగతనాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనే సేమ్ ఫార్ములా ఇందులోనూ ఉంటుంది.  ఇలాంటి హెయిస్ట్ థ్రిల్లర్లకు దొంగతనాన్ని ఎలా చేశారు అనే విధానమే ప్రధాన ఆయువు పట్టు. ఆ విషయంలో ‘భామా కలాపం 2’ సక్సెస్ అయింది. ఆ హెయిస్ట్ ఎపిసోడ్ చాలా  ఎక్సైటింగ్‌ కలిగిస్తుంది. ప్రియమణి మల్టీ టాస్కింగ్, ఆ సమయంలో శరణ్య ప్రదీప్ కన్ఫ్యూజన్ బాగా నవ్విస్తాయి. సెకండాఫ్‌లో ప్రియమణి  దొంగతనానికి వెళ్లే సీన్,  క్లైమ్యాక్స్‌ బాగున్నాయి. ఇందులోనే  సీక్వెల్‌కు లీడ్ ఇచ్చారు. వచ్చే భాగం విదేశాల్లో ఉంటుందన్నట్లు చూపించడం కొసమెరుపు. ప్రియమణి, శరణ్య ప్రదీప్‌ల క్యారెక్టరైజేషన్స్ ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి కాబట్టి సరైన స్టోరీలు పట్టుకుంటే తెలుగులో ఒక ఓటీటీ ఫ్రాంచైజీ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది.
సంగీతం విషయానికి వస్తే ప్రశాంత్ ఆర్ విహారి స్వర పరిచిన స్వప్న సుందరి పాట బాగుంటుంది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. సినిమాటోగ్రాఫర్ దీపక్ యారగెరా విజువల్స్ బాగా తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు సినిమాని నిర్మించారు.

తెలివైన గృహిణి పాత్రలో ప్రియమణి ఆకట్టుకుంటారు. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ తెలివిగా అనుపమ పాత్ర ఉంటుంది. ఆ ఛేంజ్‌ను ప్రియమణి చాలా చక్కగా స్క్రీన్‌పై చూపించారు. శరణ్య  పాత్ర  మొదటి భాగం కంటే ఇంకా ఫన్నీగా ఉంటుంది. తను చక్కగా నటించారు. సీరత్ కపూర్, సందీప్ వేద్, అనూజ్ గుర్వారా, రఘు ముఖర్జీ, రుద్ర ప్రదీప్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇలాంటి జోనర్ ఇష్టపడే వారు  ఆహా ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి ‘భామా కలాపం 2’ చూసి టైమ్ పాస్ చేయండి.
రేటింగ్: 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: