ప్రభాస్ "రాజా సాబ్" లేటెస్ట్ షెడ్యూల్ అప్డేట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ కొంత కాలం క్రితమే సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ వరల్డ్ వైడ్ గా భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ప్రభాస్ కి సంబంధించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఒక్క సారిగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ నెల మూడవ వారం తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ లేని సన్నివేశాలను ఈ చిత్ర బృందం చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ప్రభాస్ అదిరిపోయే ఊరఅస్ లుక్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన రిద్ది కుమార్ , నీది అగర్వాల్ , మాళవిక మోహన్ లు హీరోయిన్ లుగా నటించబోతుండగా ... సంజయ్ దత్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: