ఆ రెండు తేదీల్లో "దుబాయ్ శీను" స్పెషల్ షోస్..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ చాలా సంవత్సరాల క్రితం దుబాయ్ శీను అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార , రవితేజ కి జోడి గా నటించగా ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జే డి చక్రవర్తి ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ 2007 వ సంవత్సరం థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల ఆయన ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబట్టింది. ఇలా ఆ టైమ్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తిరిగి మళ్ళీ థియేటర్ లలో విడుదల చేయబోతున్నారు.
 

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ.కి సంబంధించిన స్పెషల్ షో లను ఫిబ్రవరి 24 , 25 తేదీల్లో ప్రదర్శించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ పైన అవుతుంది. ఇకపోతే ఇప్పటికే రవితేజ హీరో గా రూపొందిన కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో వెంకీ సినిమా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను రీ రిలీజ్ లో భాగంగా జనాల నుండి తెచ్చుకుంది. మరి దుబాయ్ శీను మూవీ రీ రిలీస్ గురించి కూడా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: