త్రివిక్రమ్ కు జోష్ ను కలిగిస్తున్న నెట్ ఫ్లిక్స్ !

Seetha Sailaja
సంక్రాంతికి అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గుంటూరు కారం’ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆసినిమా ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయింది. అయితే త్రివిక్రమ్ మహేష్ ల కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ రీత్యా ఈ మూవీకి 110 కోట్ల నెట్ కలక్షన్స్ వచ్చినప్పటికీ ఈసినిమా ఫ్లాప్ ముద్రను తప్పించుకోలేకపోయింది.

ఈసినిమా విడుదలైన మూడు వారాలకే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న పరిస్థితులలో ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో క్రియేట్ చేస్తున్న రికార్డులు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఈసినిమా స్ట్రీమ్ అవ్వడం మొదలుపెట్టి వారం రోజులు కాకుండానే ఇండియన్ క్యాటగిరీలో తెలుగు వర్షన్ నెంబర్ వన్ స్థానంలో ఉంటే హిందీ డబ్బింగ్ నాల్గవ స్థానంలోను తమిళ వెర్షన్ 7వ స్థానంలో కొనసాగుతూ ఉంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 6వ స్థానంలో నిలబడటం ఇండస్ట్రీ వర్గాలను మాత్రమే కాకుండా ఏకంగా త్రివిక్రమ్ కు కూడ ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్.

ఈసినిమా విడుదలైన మొదటి రోజున ఈమూవీకి వచ్చిన నెగిటివ్ టాక్ తో త్రివిక్రమ్ ఈమూవీ సక్సస్ మీట్ లో కూడ కనిపించలేదంటే మాటల మాంత్రికుడుని ఈమూవీ పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ఏస్థాయిలో అతడికి షాక్ ఇచ్చాయో అర్థం అవుతుంది. అంతేకాదు ఈమూవీ గురించి విడుదల తరువాత మహేష్ కూడ ఒక్క మాట మాట్లాడలేదు.

దీనితో వీరిద్దరూ ఈమూవీ పై జరిగిన నెగిటివ్ ప్రచారానికి ఏవిధంగా షాక్ అయ్యారో అర్థం అవుతుంది. ఈ షాక్ నుండి తేరుకున్న మహేష్ రాజమౌళి సినిమా గురించి దృష్టి పెడితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తాను తీయబోయే సినిమా కథ గురించి ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు త్రివిక్రమ్ బన్నీ కోసం వ్రాస్తున్న కథ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రస్తావన లేకుండా ఈసారి ఒక ఫ్యాంటసీ సబ్జెక్ట్ వైపు అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: