మలయాళ సినిమా ప్రేమమ్ తో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమ నుండి అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో వరుసగా తెలుగు సినీ పరిశ్రమలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు పెరిగాయి.
ఇకపోతే ఈ నటి కెరియర్ ప్రారంభంలో చాలా శాతం డీసెంట్ పాత్రల్లో , పద్ధతి గల పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరించింది.
ఇక కొంత కాలం క్రితం ఆశిష్ హీరోగా రూపొందిన రౌడీ బాయ్స్ అనే సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మొదటి సారి ఈమె వెండి తేరపై ముద్దు సన్నివేశాలలో నటించింది. ఈమెను క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో చూసి ఇష్ట పడిన జనాలు ఏకంగా ముద్దు సీన్ లలో , రొమాంటిక్ సీన్ లలో చూసి తట్టుకోలేకపోయారు.
కానీ ఈ ముద్దు గుమ్మ మాత్రం ఇదే స్టైల్ లో తన కెరీర్ ను ముందుకు సాగించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా అనుపమ "టిల్లు స్క్వేర్" అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నుండి ఇప్పటికే అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా అందులో అన్నింటిలోనూ ఈమె హాట్ లుక్ లోనే కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేయగా ఇందులో ఏకంగా ఈ ముద్దుగుమ్మ భారీ నిడివి కలిగిన ముద్దు సీన్ లలో నటించింది.
దీనితో కొంతమంది ప్రేక్షకులు అనుపమాను మరింతగా ఇష్టపడుతూ ఉంటే మరి కొంత మంది మాత్రం అనుపమ మరి ఈ స్థాయిలో రెచ్చిపోతుంది అనుకోలేదు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ ఈ ముద్దు గుమ్మ మాత్రం తన అందాలను అదిరిపోయే రేంజ్ లో సినిమాల్లో ఆరబోయడానికి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.