ఈ దెబ్బతో జాన్వి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినట్లేనా..?

Pulgam Srinivas
శ్రీదేవి , బోనీ కపూర్ ల కూతురు జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె శ్రీదేవి , బోని కపూర్ ల వారసురాలిగా బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. దానితో ఈమెకు కెరియర్ ప్రారంభం లోనే హిందీ సినీ పరిశ్రమ నుండి అద్భుతమైన క్రేజ్ కలిగిన సినిమాలలో అవకాశాలు దక్కాయి. అలా హిందీ సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు అద్భుతమైన రీతిలో కెరియర్ ను కొనసాగించిన ఈమె ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ వైపు తన దృష్టిని మళ్లించింది.

అందులో భాగంగా ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై తెలుగు తో పాటు ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే ఈ సినిమాలోని ఒక్క భాగం కూడా విడుదల కాకముందే ఈమెకు తెలుగు నుండి మరో క్రేజీ సినిమా అవకాశం కూడా దక్కినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా కాంబో లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ లో కూడా ఈ బ్యూటీ నే హీరోయిన్ గా ఎంపిక అయినట్లు సమాచారం. ఇప్పటికే బుచ్చిబాబు , జాన్వి కి కథను వినిపించగా ... ఆ కథ మొత్తం విన్న జాన్వి వెంటనే రామ్ చరణ్ హీరో గా రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒక వేళ చరణ్ సినిమాలో కూడా జాన్వి కి ఆఫర్ వచ్చినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో డైరెక్ట్ గా టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: