"విశ్వంబర" లేటెస్ట్ షెడ్యూల్ అప్డేట్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి , మల్లాడి వశిష్ట కాంబోలో విశ్వంబర అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇకపోతే గతంలో చిరంజీవి , త్రిష కాంబోలో స్టాలిన్ అనే మూవీ రూపొందింది. చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అలాగే ఆ మూవీ లో చిరు , త్రిష జంటకు కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.


ఇకపోతే విశ్వంభర మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ ఉండగా ... ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ లేటెస్ట్  షూటింగ్ పూర్తి అయ్యింది.  ఈ మూవీ మొదటి షెడ్యూల్ ను చిరంజీవి లేకుండా వచ్చే సన్నివేశాలను ఈ మూవీ మేకర్స్ చిత్రీకరించారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇందులో చిరంజీవి తో పాటు త్రిష కూడా జాయిన్ అయింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యొక్క రెండవ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.


ఈ మూవీ రెండవ షెడ్యూల్ లో చిరంజీవి , త్రిష పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ బృందం కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మూడవ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మూడవ షెడ్యూల్ ను కూడా భారీగా ఈ చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇకపోతే ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: