ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫోటోను షేర్ చేసిన మెగా జంట....!!

murali krishna
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఉపాసన తరచు తనకు తన కూతురికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.అయితే నేడు ప్రేమికుల దినోత్సవం కావడంతో ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. సాధారణంగా వాలెంటైన్స్ డే అంటే ప్రతి ఒక్కరు కూడా వారి జీవిత భాగస్వామి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారిపై ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు.ఇక వాలెంటైజ్ డే సందర్భంగా ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే ఈమె షేర్ చేసిన ఫోటోలో రామ్ చరణ్ మాత్రమే కాకుండా తన కుమార్తె కూడా ఉండటం గమనార్హం. ప్రేమ అంటే కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదని తన కుమార్తె కూడా అనే అర్థం వచ్చేలా ఈమె ఈ పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా ఉపాసన షేర్ చేసిన ఫోటోలో రామ్ చరణ్ చేతిలో ఉపాసన క్లీన్ కారా  చేతులు వేసి ఉన్నారు. ఇలా ఈ ముగ్గురు ఒకరి చేతిని మరొకరు పట్టుకొని ఉన్నటువంటి ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.  ఇలా ఈ ఫోటోని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోకి ఇన్ఫినిటీ అలాగే లవ్ ఎమోజీలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలా వీరి ప్రేమ ఇప్పటికీ అనంతమైనదనే ఉద్దేశంతో ఈమె ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఉపాసన తన కుమార్తె ఎలా ఉంటుందనే విషయాలను మాత్రం రివీల్ చేయలేదు దీంతో మెగా అభిమానులు మెగా ప్రిన్సెస్ ని ఎప్పుడు చూపిస్తారు అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. బహుశా ఈమె తన కుమార్తె మొదటి పుట్టినరోజు వరకు తన ఫేస్ రివీల్ చేయరేమో అంటూ మరికొందరు కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: