పుష్ప 2 ఐటం ఫిక్స్.. రంగంలోకి ఆ బోల్డ్ బ్యూటీ..!

shami
పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 మీద భారీ హైప్ ఏర్పడింది. అయితే ఆడియన్స్ దాని మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సుకుమార్ ప్లానింగ్ ఉంది. పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్ మరోసారి తన నటన తో అందరినీ ఆశ్చర్య పరుస్తాడని తెలుస్తుండగా సుకుమార్ టేకింగ్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఇక పుష్ప 2 స్పెషల్ సాంగ్ గురించి కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉండగా లేటెస్ట్ గా దానికి సంబందించిన న్యూస్ కూడా బయటకు వచ్చింది.
పుష్ప 2 సినిమా లో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామని ఫైనల్ చేశారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం పుష్ప 2 లో దిశా పటాని ఉంటుందని టాక్. ఈ సాంగ్ కోసం అమ్మడికి భారీ రెమ్యునరేషన్ అందిస్తున్నారట. మామూలుగానే ఫోటో షూట్స్ తోనే బికినీ తో రెచ్చిపోయే దిశా పటాని ఈ స్పెషల్ సాంగ్ కోసం దుమ్ము దులిపేస్తుందని అంటున్నారు.
ప్రస్తుతం దిశా పటానికి కల్కి సినిమా లో కూడా భాగం అవుతుంది. సూర్య కంగువ లో కూడా ఆమె హీరోయిన్ గా చేస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటుగా పుష్ప 2 లో కూడా స్పెషల్ సాంగ్ చేసి అలరించాలని చూస్తుంది. ఈ సినిమాలతో సౌత్ లో దిశా మరోసారి హాట్ ఫేవరెట్ కాబోతుందని చెప్పొచ్చు. తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లోఫర్ సినిమాలో నటించిన దిశ ఆ ఒక్క సినిమాతో మళ్లీ ఇటు రాలేదు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో అలరించాలని చూస్తుంది. సమంత చేసిన ఉ అంటావా సాంగ్ ని మించి పుష్ప 2 ఐటం సాంగ్ పాన్ చేస్తున్నాడట సుకుమార్. ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ ఆ సాంగ్ కంపోజిషన్ పూర్తి చేశాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: