"ఈగల్" మూవీకి 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
రవితేజ హీరోగా రూపొందిన ఈగల్ మూవీ ఫిబ్రవరి 9 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.93 కోట్ల షేర్ ... 8.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.43 కోట్ల షేర్ ... 6.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.40 కోట్ల షేర్ ... 6.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 1.13 కోట్ల షేర్ ... 2 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇక మొత్తంగా ఈ సినిమాకి 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా 12.88 కోట్ల షేర్ ... 23.60 కోట్ల  గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఇక ఈ సినిమా మరో 9.12 కోట్ల షేర్ కలెక్షన్ పను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని వరల్డ్ వైడ్ గా క్లీన్ హీట్ గా నిలుస్తుంది.
ఇకపోతే కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: