ఫ్యామిలీ స్టార్ "నందనందన" సాంగ్ కి సూపర్ రెస్పాన్స్..!

Pulgam Srinivas
విజయ్ దేవరకొండ హీరో గా మృనాల్ ఠాగూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ... ఈ మూవీ కి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే గతంలోనే విజయ్ , పరుశురామ్ కాంబో లో గీత గోవిందం అనే మూవీ రూపొంది అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడంతో వీరి కాంబో లో ఫ్యామిలీ స్టార్ మూవీ అనౌన్స్ అయిన రోజు నుండే ఈ సినిమాపై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఆ అంచనాలకు తగినట్టు గానే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదల అయిన ప్రచార చిత్రాలు అన్నీ కూడా సూపర్ గా ఉండడంతో ఈ సినిమాపై ప్రస్తుతం సినీ ప్రేమికుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొద్ది రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "నందనందన" అంటూ సాగే పాటను ఈ మూవీ బృందం విడుదల చేసింది.

ఇకపోతే ఈ సాంగ్ విడుదల అయిన చాలా తక్కువ రోజుల్లోనే ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 21 మిలియన్  వ్యూస్ ... 122 కే లభించాయి. ఇక ఇప్పటి వరకు ఈ సాంగ్ కి వస్తున్నా రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించినట్లే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: