కొడుకుని ఫుట్ బాల్ ప్లేయర్ గా చూడాలనుకుంటున్న సైఫ్ అలీ ఖాన్

Anilkumar
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు తమ వారసులను హీరోగా పరిచయం చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇండస్ట్రీలో తమ లెగసి కంటిన్యూ చేయాలని ఆరాటపడుతుంటారు. ఎవరో కొందరు హీరోలు మాత్రమే వారసులను సినిమా ఇండస్ట్రీకి దూరంగా పెంచుతారు. బాలీవుడ్ విషయానికొస్తే దాదాపు అందరు హీరోలు వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ మాత్రం తన కొడుకు విషయంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ దంపతుల ముద్దుల కొడుకు తైమూర్ అలీ ఖాన్ కెరియర్ గోల్స్ గురించి తండ్రి సైఫ్ అలీ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.
 సైఫ్ అలీ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో తన కొడుకు హీరో కాకుండా గిటారిస్ట్, ఫుట్ బాల్ ప్లేయర్ కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా తన కొడుకు సక్సెస్ ఫుల్ ఫుట్ బాల్ ప్లేయర్ కావడానికి త్వరలోనే అర్జెంటీనాకు వెళ్లనున్నట్లు తెలిపాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో కరీనా కపూర్ సైతం తన కొడుకుని గొప్ప ఫుట్ బాల్ ప్లేయర్ గా చూడాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాదు ఫుట్ బాల్ లో మెస్సీ అంతటి వాడవ్వాలని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచింది.
 సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్ 2018లో 'కేదార్ నాథ్' సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పోషించిన ముక్కు పాత్రకు మంచి పేరొచ్చింది. అంతేకాదు మొదటి సినిమాతోనే బెస్ట్‌ డెబ్యూట్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. ఆ తర్వాత 'సింబా', 'లవ్‌ ఆజ్‌ కల్‌' 'కూలీ నంబర్‌ వన్‌' తర్వాత ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో ఆమె 'అత్రాంగి రే' వంటి సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది. సారా చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: