'కల్కి' ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్న నిర్మాత?

Anilkumar
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో కల్కి పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు వరల్డ్ సినిమా చూడనంత గ్రాండ్‌గా 'కల్కి' తెరకెక్కుతుందని మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. ఈ సినిమా కోసం నాకు అశ్విన్ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. సుమారు 550 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కి భారీ డిమాండ్ నెలకొంది.

'కల్కి' సినిమాని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ ఇప్పటికే సినిమా బిజినెస్ ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం నిర్మాత అశ్వనిదత్ ఏకంగా రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం. అయితే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం రూ.70 నుంచి రూ.75 కోట్ల మధ్యన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. కానీ నిర్మాత మాత్రం రూ.100 కోట్లు ఇస్తేనే ఓవర్సీస్ రైట్స్ ఇస్తామని క్లారిటీగా చెప్పారట. అంతేకాదు ఈ రేట్ కి ఎవరూ కోట్ చేయకపోతే ఓవర్సీస్ లో సొంతంగా రిలీజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
 ఓవర్సీస్ లోనే కాదు ఇండియా మొత్తం మీద కూడా అదే స్థాయిలో 'కల్కి' మూవీకి బిజినెస్ లెక్కలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి 'RRR' మూవీ కంటే ఎక్కువ మొత్తాన్ని ని 'కల్కి' సినిమా కోసం డిమాండ్ చేస్తున్నారట నిర్మాత. సినిమా క్వాలిటీ, కంటెంట్, స్టాండర్డ్స్, బడ్జెట్.. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ స్థాయిలో డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ తో పాటు ఆల్ ఓవర్ ఇండియాలో డిమాండ్ చేసే ప్రైస్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రాకపోతే అన్ని ఏరియాల్లో సొంతంగానే సినిమాని రిలీజ్ చేసుకోవాలని నిర్మాత భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: