'హరిహర వీరమల్లు' సినిమా నుంచి తప్పుకున్న క్రిష్

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో సినిమా షూటింగ్స్ పక్కన పెట్టిన పవర్ స్టార్ ప్రస్తుతం రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. మళ్లీ ఎలక్షన్స్ తర్వాత పవన్ కమిట్ అయిన సినిమా షూటింగ్స్ పూర్తి చేసే అవకాశం ఉంది. పవన్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతోంది. గతంలో పవన్ కల్యాణ్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ చిన్న విడియోను రిలీజ్ చేశారు మేకర్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలు మాత్రం వరుస షూటింగ్ లు పూర్తి చేసుకుంటుంటే ఈ మూవీ మాత్రం ఏదొక కారణంతో ఆలస్యం అవుతూ వస్తోంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలాంటి పిరియాడికల్ రోల్ చేస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసలు ఈ సినిమా ఉంటుందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
పవన్ సినిమా నుంచి తప్పుకున్న క్రిష్
'హరిహర వీరమల్లు' సినిమాని 2020లో మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు  రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. పవన్ ఈ సినిమా కోసం పవన్ ఇచ్చిన డేట్స్ ని క్రిష్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని షూటింగ్ చేయడంలో విఫలమయ్యాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ అవుట్ పుట్ చూసి పవన్ అసంతృప్తిగా ఉన్నారని, కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసినా కూడా పవన్ కి నచ్చలేదని చెబుతున్నారు. ఇక ఇప్పుడు క్రిష్, పవన్ కళ్యాణ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ లు, దానికి తోడు బడ్జెట్ సమస్యలు అలాగే పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు మరుగున పడిపోయింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం నిర్మాత ఏఎం. రత్నం చాలా ఖర్చు పెట్టాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి దర్శకుడిగా తప్పుకున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. అంతేకాదు ఆయన స్థానంలో మరో డైరెక్టర్ 'హరిహర వీరమల్లు' పెండింగ్ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అనుష్క తో లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్
'హరిహర వీరమల్లు' సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. క్రిష్ ఇప్పటికే క స్క్రిప్ట్ కంప్లీట్ చేస్తారని, ఈ UV క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: