త్రివిక్రమ్ అడ్డంగా దొరికేసాడుగా.. గుంటూరు కారంలో ఇది గమనించారా?

praveen
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే వరుస సూపర్ హిట్లతో ట్రాక్ లో ఉన్న మహేష్ బాబు ఇటీవల అటు గుంటూరు కారం అనే సినిమాతో మాత్రం కాస్త వెనకబడ్డాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా మాత్రమే నిలిచింది అని చెప్పాలి. ఇక ఫ్యాన్స్ అందరినీ కూడా నిరుత్సాహానికి గురి చేసింది. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి కూడాయావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాను రొటీన్ గా తీశాడు అంటూ ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.

 అయితే గుంటూరు కారం సినిమా విడుదలైంది. ఇక ఎన్నో విమర్శల మధ్య థియేటర్లలో కొనసాగింది. ఇక ఇప్పుడు అటు ఓటీటి లో కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఈ సినిమా వార్తల్లో మాత్రం నిలుస్తూనే ఉంది. ఇక ఈ సినిమాపై ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు అని చెప్పాలి. ఇక తాజాగా గుంటూరు కారం సినిమా గురించి ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఏకంగా డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ మాత్రం చూసుకోకుండా అడ్డంగా దొరికేశాడు అంటూ ఎంతో మంది నేటిజన్స్ ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ లు చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది అంటారా.. సినిమా మధ్యలో లారీలపై ఒక్కొక్కరు మూటలు జారేస్తున్న సీన్ ఒకటి ఉంటుంది.

 ఈ క్రమంలోనే లారీలపై నిలబడిన కూలీలు.. అందరూ కూడా లారీల కిందకి మూటలు జారవేస్తూ.. ఇక ఈ సీన్లు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇద్దరు మాత్రం ఏకంగా ఆ మూటను పట్టుకొని అటు ఇటు తిప్పడం తప్ప.. కనీసం కిందికి జార వేయరు. ఇక ఇది ట్రోలర్స్ గమనించేశారు. ఇంకేముంది ఈ వీడియోని కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నావ్ భయ్యా అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో త్రివిక్రమ్.. మరోసారి నిర్లక్ష్యంతో ఇక నేటిజన్స్ కి దొరికేసాడుగా అంటూ అందరూ కామెంట్స్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: