పెరిగిపోతున్న జాన్వీ కపూర్ మ్యానియా !

Seetha Sailaja
శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ కు మంచి నటిగా పేరు వచ్చినప్పటికీ ఆమెకు ఇప్పటివరకు బాలీవుడ్ లో సరైన బ్రేక్ రాలేదు. బాలీవుడ్ టాప్ యంగ్ హీరోలతో ఆమె నటించడానికి ప్రయత్నించినప్పటికీ వారి నుండి జాన్వీ కి అవకాశాలు ఎందుకనో రాలేదు అని అంటారు. దీనితో ఆమె దృష్టి దక్షిణాది సినిమా రంగం పై ముఖ్యంగా టాలీవుడ్ పై పడింది.

ప్రస్తుతం ఆమె జూనియర్ ఎన్టీఆర్ పక్కన ‘దేవర’ మూవీలో డీ గ్లామర్ పాత్రలో చేస్తోంది. అయితే ఈసినిమా షూటింగ్ సమయంలో ఆమె నటనలో చూపిస్తున్న అద్భుతమైన ప్రతిభకు జూనియర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడ ప్రశంసలు కురిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు రామ్ చరణ్ దృష్టి వరకు వెళ్లడంతో త్వరలో అతడు బుచ్చిబాబు దర్శకత్వంలో నటించబోయే మూవీలో జాన్వీ కి హీరోయిన్ పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ రెండు సినిమాలతో ఆమె మ్యానియా టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయం అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఆమెకు కాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి కూడ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా త్వరలో అత్యంత భారీ బడ్జెట్ తో  నితీష్ తివారి తీయబోయే ‘రామాయణం’ లో ఈమెను సీత పాత్ర కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్.

రణబీర్ కపూర్ శ్రీరాముడుగా నటించబోయే ఈమూవీలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సీత పాత్ర యూటర్న్ తీసుకుని జాన్వీ వైపు వెళ్ళినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు వరాస్తోంది. ఈ వార్తలే నిజం అయితే జాన్వీ టాప్ హీరోయిన్ గా తన స్థానాన్ని అందుకోగల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియన్ సినిమాను షేక్ చేస్తున్న దీపికా అలియా భట్ లు సీనియర్ హీరోయిన్స్ గా మారిపోవడంతో జాన్వీకి అదృష్టంగా మారింది అనుకోవాలి..  
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: