మహేష్ బాబు సినిమాలో.. ఇండోనేషియా బ్యూటీ.. ఆమె పేరేంటో తెలుసా?

praveen
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం అనే మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఎదురుచూస్తున్న రాజమౌళితో సినిమాకు రెడీ అయ్యాడు మహేష్. ఇక ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్టులు పెట్టుకోకుండా కేవలం జక్కన్న సినిమాతోనే బిజీ అవ్వబోతున్నాడు మహేష్ బాబు. అయితే ఈ మూవీపై ఉన్న అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అమెజాన్ అడవుల్లో అడ్వెంచర్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది అనేది తెలుస్తుంది.

 ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి చేశాడట ఇక దీంతో ఇక ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడమే తరువాయి అని తెలుస్తుంది. అయితే ఇక రాజమౌళి సినిమాలలో హీరోలు ఎంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన గా మారిపోతూ ఉంటారో.. హీరోయిన్లు కూడా అదే రీతిలో కీలకంగా మారుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు సినిమాలో హీరోయిన్గా ఎవరిని జక్కన్న సెలెక్ట్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కు జోడిగా విదేశీ భామను తీసుకువచ్చినట్లుగానే ఇక ఇప్పుడు మహేష్ తో సినిమాలో కూడా మరో విదేశీ హీరోయిన్ ను తీసుకురావడానికి జక్కన్న ఆసక్తిగా ఉన్నాడట.

 ఈ క్రమంలోనే రాజమౌళి - మహేష్ బాబు కాంబినేషన్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ మూవీలో ఏకంగా మహేష్ బాబు సరసన ఇండోనేషియా బ్యూటీ జెల్సియా ఇస్లాన్ నటించబోతుందట. అయితే ఇటీవల ఈ హీరోయిన్ అటు రాజమౌళిని ఇంస్టాగ్రామ్ లో ఫాలో కొట్టడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పాలి. అయితే ప్రతి విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేసి రాజమౌళి హీరోయిన్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. నిజంగానే ఇండోనేషియా బ్యూటీ ని హీరోయిన్గా తీసుకున్నారా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: