ఈ సంవత్సరం వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగులో రీ రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం వాలెంటెన్స్ డే సందర్భంగా కొన్ని సినిమాలు తెలుగు భాషలో రీ రిలీజ్ కాబోతున్నాయి. ఆ సినిమాలు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల క్రితం తొలిప్రేమ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను ఈ సంవత్సరం వాలెంటెన్స్ డే సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.
తమిళ నటుడు సూర్య కొంత కాలం క్రితం సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి రిలీజ్ లో సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు రీ రిలీజ్ చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక మరోసారి ఈ సినిమాను వాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.
సిద్ధార్థ్ హీరో గా రూపొందిన ఓయ్ మూవీ ని కూడా ఈ సంవత్సరం ప్రేమికుల రోజు సందర్భంగా రి రిలీజ్ చేయబోతున్నారు.
దుల్కర్ సల్మాన్ హీరో గా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో సీత రామం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమాని ఈ సంవత్సరం ప్రేమికుల రోజు సందర్భంగా థియేటర్ లలో మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇలా ఈ నాలుగు సినిమాలను ఈ సంవత్సరం ప్రేమికుల రోజు సందర్భంగా మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: