దేవర కోసం మరాఠి అందగత్తెని దించుతున్నారా..?

shami
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కొరటాల శివ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా సెట్స్ మీద ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటికే జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సినిమాలో గ్లామర్ ని పెంచేలా మరో ఇద్దరు భామలను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. జాన్వి కపూర్ తో పాటుగా సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మరో బాలీవుడ్ భామని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు.
ఇక మరోపక్క సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం శృతి ని సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరాఠి సినిమాల్లో బాగా పాపులర్ అయిన శృతి హిందీలో కూడా నటించింది. సినిమాలే కాదు సీరియల్స్ లో కూడా శృతి నటించినట్టు తెలుస్తుంది. దేవర సినిమాలో ఆమెది మంచి పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తుంది.
ఈ సినిమాతో శృతి తెలుగు తెరకు పరిచయం అవుతుంది. దేవర సినిమాకు కొరటాల శివ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారన్ తెలుస్తుంది. సినిమా రెండు భాగాలుగా వస్తుండగా అసలైతే ఏప్రిల్ లో సినిమా రిలీజ్ చేయాల్సి ఉన్నా కుదరలేదు. దసరా కల్లా సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. దేవర సినిమా లో ఎన్.టి. మరోశారి తన నట విశ్వరూపాన్ని చూపిస్తారని తెలుస్తుంది. దేవర మీద తారక్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.
RRR తర్వాత ఎన్.టి.ఆ చేస్తున్న ఈ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆచార్య ఫ్లాప్ తర్వాత దేవర స్క్రిప్ట్ కోసం కొరటాల శివ చాలా టైం తీసుకున్నాడు. సినిమా ఎక్కడ కూడా హిట్ టార్గెట్ మిస్ అవ్వకూడదని అలా చేశాడు. తప్పకుండా దేవర తన మార్క్ సినిమాగా ఉంటుందని తారక్ అనుకుంటున్నాడు. ఫ్యాన్స్ అయితే మాత్రం దేవరతో దుమ్ము రేపే రికార్డులను సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మరి సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: