ఈగల్ రివ్యూ: విశ్వరూపం చూపించిన రవితేజ.. సినిమా అదిరింది!

Anilkumar
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ఈగల్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జోడిగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు. ఇక ఇందులో నవదీప్ అవసరాల శ్రీనివాస్ వంటి తదితరులు కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా అనగా ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల అయింది.. ఈ సినిమా అసలు కథ ఏమిటి? ఎలా ఉంది? అన్న వివరాల్లోకి వెళితే..

కథ:

ఈ సినిమా నలిని రావు(అనుపమ) తో అసలు కథ మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్ మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి చెందిన ఒక గిరిజన తండాలో సహదేవ వర్మ (రవితేజ) విగ్రహాన్ని పెట్టుకొని అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు. జర్నలిస్ట్ నళిని రావు (అనుపమ) అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూసి, ఆ క్లాత్ పండే ఊరికి సంబంధించి ఒక ఆర్టికల్ రాస్తోంది. దాంతో సీబీఐ రంగంలోకి దిగి సదరు పత్రిక మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇంతకీ, సహదేవ వర్మకి ఆ కాటన్ క్లాత్ కి ఉన్న సంబంధం ఏమిటి ? ఇంతకీ, ఈ సహదేవ్ వర్మ ఎవరు ? ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సీబీఐ రంగంలోకి దిగింది ?అసలు సహదేవ్ భార్య రచన (కావ్య థాపర్)కి ఏమైంది ? ఈ మొత్తం వ్యవహారంలో ఈగల్ ఎవరు ? అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల నటన: రవితేజ హై ఎనర్జీ లెవెల్స్ తోనే ఈ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాలో మాస్ మహారాజా సరికొత్త లుక్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే కావ్య తాపర్ రవితేజ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అందరిని బాగా ఆకట్టుకున్నాయి. ఇక జర్నలిస్టు పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కూడా అద్భుతంగా నటించారు. అలాగే మిగిలిన వారు కూడా వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

విశ్లేషణ:

యాక్షన్ సన్నివేశాలు సరికొత్తగా ఉండటంతో ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. అక్రమాయుధాల రవాణా, వాటితో జరిపే కాల్పుల్లో సాధారణ ప్రజలు చనిపోవడం లాంటి అంశాన్ని మాత్రం మొదటిసారి చూపించారు. ఫస్ట్ హాఫ్ నలిని సహదేవి గురించి వెతకడం తెలుసుకోవడం సరిపోతుంది. తర్వాత సెకండ్ హాఫ్ లో ఆయన గతం చెబుతారు. క్లైమాక్స్ ముందు వచ్చే యాక్షన్ సన్నివేశం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. హైటెక్నికల్ వాల్యూస్‌తో టీజీ విశ్వ ప్రసాద్ తీసిన ‘ఈగల్’‌ విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తుంది. ఫారిన్ కంట్రీస్‌లో షూటింగ్.. బాంబ్ బ్లాస్టింగ్‌లు.. హెలికాప్టర్స్.. ఇలా సినిమాలో భారీ హంగులే ఉన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ తెలిసేలా పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగానే విజువల్ ట్రీట్ అందించాడు దర్శకుడు. సినిమాటోగ్రఫీ కూడా కార్తీక్ ఘట్టమనేనే కావడంతో.. సినిమాకి రిచ్‌నెస్‌ని తీసుకొచ్చారు.

బాటమ్ లైన్: ఆయుధం అనేది కాపాడే వాడి చేతిలోనే ఉండాలి కానీ, అర్హత లేని వాళ్ళ చేతిలో ఉండకూడదనే మంచి మెసేజ్ ను ఇచ్చారు.
చిత్రం : ఈగల్
నటీనటులు: రవితేజ, కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు
దర్శకుడు : కార్తీక్ ఘట్టమనేని
నిర్మాత: టిజి విశ్వ ప్రసాద్
సంగీత దర్శకులు: డావ్ జాన్డ్
సినిమాటోగ్రాఫర్‌లు: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి
రేటింగ్: 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: