యాత్ర 2 మూవీ రివ్యూ: సినిమా చూస్తే గూస్ బంప్స్ అంతే!

Anilkumar
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను ఆధారంగా యాత్ర 2 సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాని మహి వి రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మించారు. మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది,నటీనటుల పనితీరు,అసలు కథ ఏమిటి?  అన్న వివరాల్లోకి వెళితే..
కథ :
ఈ సినిమా రెండో సారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలవుతుంది. గెలిచిన కొన్ని రోజులకే ఆయన చనిపోవడంతో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేయాల్సి వస్తుంది. అయితే ప్రోగ్రెస్ పార్టీ వద్దు అనడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టి రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత ఆయన ప్రజలకు సేవ చేయడం కోసం అధికారంలోకి వచ్చేందుకు ఎలాంటి పనులు చేశాడు? ఆయనను అధికారంలోకి రానివ్వకుండా ఎవరెవరు చేతులు కలిపారు? 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ ఎలా జగన్ ఓటమికి కారణమైంది? 2019 ఎన్నికల్లో ఎలా జగన్ గెలిచి అధికారంలోకి వచ్చారు అలాంటి విషయాలు తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే మరి.
నటీనటులు :
ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మరొకసారి మమ్ముట్టి మెరిశారు. స్క్రీన్ స్పేస్ కొంచెం తక్కువే అయినా సరే ఉన్నంతలో తనదైన శైలిలో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర లో ఆయన తప్ప మరొకరు న్యాయం చేయలేరు ఏమో అనేంతలా ఆయన ఒదిగిపోయారు. ఇక వైయస్ జగన్ పాత్రలో నటించిన జీవ కూడా చాలా హోంవర్క్ చేశాడు అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇందులో జీవా వన్ మ్యాన్ షో అనే విధంగా అద్భుతంగా నటించారు. పోలికలు ఎక్కువగా లేకపోయినా మేనరిజం విషయంలో మాత్రం జగన్ లానే అనిపించాడు. నటన కూడా ఆకట్టుకునేలా ఉంది. వైయస్ భారతి పాత్రలో నటించిన కేతకికి లభించింది చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ అయినా సరే హారతిని అచ్చుగుద్దినట్లు కనిపించే ఆమె ఉన్నంతలో బాగానే నటించింది. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల మేరకు ఎవరికి వారు బాగానే నటించారు.
విశ్లేషణ :
ఈ మూవీ కథ అందరికి తెలిసిన కథే అయినప్పటికి దాన్ని ఎలా తెరకెక్కించామన్నది ముఖ్యం అని మహి వీ రాఘవ్ ముందు నుంచీ చెబుతూనే వస్తున్నారు. యాత్ర 2 కథ ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసిందే. ఎక్కడ ఎలాంటి ఎమోషన్ సీన్ పెట్టాలి. ఎక్కడ ఎవరికి ఎలాంటి ఎలివేషన్స్ సీన్స్ పెట్టాలో తెలుసుకున్నాడు. మొత్తంగా ఈ సినిమా బాగుంది అన్న అభిప్రాయం కలుగుతుంది.
బాటమ్ లైన్ :
ఫైనల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే యాత్ర 2 వైఎస్ అభిమానులకు ఫీస్ట్. సాధారణ ప్రేక్షకులకు ఎమోషన్స్ తో కూడిన పొలిటికల్ ఎంటర్టైనర్.
నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు
రచన, దర్శకత్వం: మహీ వీ రాఘవ
నిర్మాత: మేక శివ
సినిమాటోగ్రఫి: మధీ
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
ఎడిటర్: శ్రవణ్
బ్యానర్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ 02
రిలీజ్ డేట్: 2024-02-08
రేటింగ్ : 3/5

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: