'ఈగల్ - మృగాలను మింగే మహాకాలుడు నిద్ర లేస్తే?

Anilkumar
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగల్' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాపై ఆడియన్స్ లో మరింత హై క్రియేట్ చేసేందుకు తాజాగా మేకర్స్ మరో అప్డేట్ తో ముందుకు వచ్చారు. ఈసారి 'ఈగల్ - పద్ధతైన దాడి' పేరుతో మరో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ అయితే ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగింది. ట్రైలర్ లో రవితేజ గెటప్, డైలాగ్స్, యాక్షన్, బీజీయం.. అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పాలి. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ఓ గద్ద ఎగురుతూ వెళ్తున్న షాట్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత "మ్యాథ్స్, సైన్స్కి అందని ఒక రీసెర్చ్ ఉంది సార్..

అక్కడ ఒకడుంటాడు" అంటూ నటుడు శ్రీనివాస్ రెడ్డి చేప్పే డైలాగ్ తో రవితేజ ఎంట్రీ ఇచ్చారు. నోట్లో సిగరేట్, లుంగి మడతపెడుతూ మాస్ లుక్ లో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో వచ్చిన బీజీయం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆ తర్వాత రవితేజను పోలీసులు వెతకడం ఆ సమయంలో జరిగిన విధ్వంశాలను ట్రైలర్లో ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన యాక్షన్ షాట్స్ కొత్తగా ఉన్నాయి. మధ్యలో ఒక ముసలాయన "ఆ రోజు మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు" అంటూ చెప్పగానే రవితేజ యాక్షన్ తో అదరగొట్టేసాడు. ట్రైలర్ చివరిలో.." దళం, సైన్యం కాదు దేశం వచ్చినా ఆపుతానంటూ"

రవితేజ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కే హైలైట్ గా నిలిచింది. ఇవన్నీ ఓకే అయితే ట్రైలర్ మొత్తంలో రవితేజ గెటప్ మాత్రం ఫ్యాన్స్ నే కాదు నార్మల్ ఆడియన్స్ ని సైతం ఆకట్టుకునేలా ఉంది. ఇంకా చెప్పాలంటే రవితేజకి ఆ గెటప్ సరిగ్గా సూట్ అయింది. సో మొత్తానికి ఈగల్ రెండో ట్రైలర్ తో ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ మాస్ జాతర ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్థం అవుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాని సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: