పత్తి రైతుల చుట్టూ ఈగల్ !

Seetha Sailaja
ఈవారం విడుదలకాబోతున్న మాస్ మహారజా ‘ఈగల్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ‘ధమాకా’ తరువాత సరైన హిట్ లేక బాధపడుతున్న రవితేజాకు ‘ఈగల్’ మూవీ ఆలోటు తీరుస్తుందని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాకు పోటీగా చెప్పుకోతగ్గ మూవీ ఏదీ విడుదలకాని పరిస్థితులలో ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కలక్షన్స్ చాల సులువుగానే వస్తాయని బయ్యర్లు అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ గా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజా మాట్లాడుతూ ఈ మూవీలో తాను ఎలాంటి ప్రయోగం చేయలేదని పూర్తి కమర్షియల్ సినిమా అంటూ క్లారిటీ ఇవ్వడంతో యాక్షన్ కంటెంట్ ఉన్న కమర్షియల్ మూవీ ‘ఈగల్’ అన్నస్పష్టత వచ్చింది. అయితే ఈసినిమా కథ మాత్రం పత్తి రైతుల వ్యధ చుట్టూ తిరుగుతుంది అంటూ లీకులు వస్తున్నాయి.

గిట్టుబాటు ధర రాకపోవడంతో తెలుగు రాష్ట్రాలలో పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం ఓపెన్ సీక్రెట్. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పత్తి రైతుల పట్ల సానుభూతి చూపెడతారు కానీ వారి సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపెట్టలేకపోతున్నారు. అయితే ఈమూవీలో డైరెక్ట్ గా సందేశాలు లేకుండా అంతర్లీనంగా మెసేజ్ ఉండేలా దర్శకుడు కార్తీకు ఘట్టమనేని చాల తెలివిగా స్టోరీ డిజైన్ చేశాడు అని అంటున్నారు.

రవితేజా ఫ్లాష్ బ్లాక్ లో స్వయంగా పత్తి రైతుగా కనిపిస్తాడని ఒక ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీ పై సగటు ప్రేక్షకులలో ఇప్పటికీ క్రేజ్ ఏర్పడక పోవడంతో ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ఆశించిన స్థాయిలో ఉంటాయా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. దీనికితోడు ఎన్నికల రీత్యా పరీక్షలు చాల ముందుగా జరుగుతున్న నేపధ్యంలో ఎంతవరకు ఈమూవీని చూడటానికి యూత్ ముందుకు వస్తారు అన్నసందేహాలు కూడ ఉన్నాయి. ఈ మూవీ అనుకున్న అంచనాలను కలక్షన్స్ విషయంలో అందుకోలేకపోతే మాస్ మహారాజ రవితేజా సినిమాల భవిష్యత్ మార్కెట్ పై బాగా ప్రభావం చూపెట్టే ఆస్కారం ఉంది అన్నమాటలు వినిపిస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: