వైరల్ ఫోటో : సడన్ గా చూసి.. బన్నీని సుకుమార్ అనుకుంటున్న ఫ్యాన్స్?

praveen
టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా విడుదలై ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది  ఇక ఈ షూటింగ్ తో బిజీబిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. అయితే గత రెండేళ్ల నుంచి కూడా బన్నీ అభిమానులందరూ ఈ మూవీ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా విడుదల ఉంటుందని అనుకున్నప్పటికీ అభిమానులకు నిరాశ తప్పలేదు.

 అయితే ఈ ఏడాది ఆగస్టులో సినిమాను విడుదల చేస్తామని.. ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే పుష్ప 2 కోసం ప్రత్యేకంగా గడ్డం జుట్టు పెంచుకొని.. ఎంతో మాస్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ ఇక పుష్ప 2 కోసం మరింత మాస్ లుక్ ట్రై చేసాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే బన్నీ న్యూ లుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత  అల్లు అర్జున్తో కలిసి దిగిన ఫోటో ఒకటి షేర్ చేసింది. అయితే ఇక ఈ ఫోటో చూసిన వెంటనే డైరెక్టర్ సుకుమార్ అతని భార్య తబిత ఫోటోలో ఉన్నారు అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ కాస్త జూమ్ చేసి చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఏకంగా అచ్చం సుకుమార్ లాగే కనిపిస్తూ ఈ ఫోటోలో ఉన్నది సుకుమార్ కాదు ఏకంగా అల్లు అర్జున్ అని అర్థం చేసుకుంటున్నారు. సుకుమార్ కూడా అలాగే గడ్డంతో ఉండడంతో పాటు అలాగే కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటాడు. సేమ్ సుకుమార్ లాగే బన్నీకి గడ్డం కళ్ళద్దాలు ఉండడంతో ఒక్కసారిగా చూడగానే అక్కడ ఉన్నది అల్లు అర్జున్ కాదు డైరెక్టర్ సుకుమార్ అంటూ అనుకుంటున్నారు అందరూ. మరి పైన ఫోటో చూడగానే మీకు ఏమనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: