రవితేజ పై ర్యాప్ సాంగ్.. నెట్టింట వైరల్!

Anilkumar
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ 'ఈగల్' మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవల నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓ కుర్రాడు రవితేజ పై ఓ స్పెషల్ ర్యాప్ సాంగ్ పాడి అదరగొట్టాడు. 'C Shore' పేరుతో సోషల్ మీడియాలో ర్యాప్ సాంగ్స్ పాడే కుర్రాడు ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజీ ఎక్కి మరీ రవితేజ గురించి ఓ స్పెషల్ సాంగ్ పాడాడు. ముఖ్యంగా రవితేజ మాస్ మహారాజా ఎలా మారారో తన ర్యాప్ లో వివరించారు. భూపతి రవిశంకర్ రాజు.. మాస్ మహారాజా రవితేజ ఎలా

 అయ్యాడో ఈ సాంగ్ లో వివరించాడు. ఒక్క పాట ద్వారానే రవితేజ కెరియర్ మొత్తాన్ని పాట రూపంలో చూపించడు. ముఖ్యంగా ఆయన సినిమాల్లోని డైలాగ్ లను కూడా వినిపించారు. మనలాగే ఓ అబ్బాయి.. మనలాగే మిడిల్ క్లాస్.. సినిమా అంటే పిచ్చి.. టాలెంట్ ఏమో ఎక్కువ అంటూ స్టార్ట్ చేశాడు. అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ అతను.. అతని పేరమే రవిశంకర్ రాజు అంటూ ప్రాసలతో అదరగొట్టాడు. ఆ ర్యాపర్ రవితేజ సినిమాలోని డైలాగ్స్, సినిమా పేర్లు వివరిస్తూ పాడిన ఈ పాట హైలెట్ గా నిలిచింది. ఈ ర్యాప్ సాంగ్ కి మాస్ మహారాజా రవితేజ సైతం ఫిదా అయిపోయారు. అతను సాంగ్ పాడుతున్నంతసేపు రవితేజ ఫుల్ ఎంజాయ్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ముఖ్యంగా మాస్ రాజా ఫ్యాన్స్ ఈ వీడియోని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇదే వీడియోని ఈగల్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. ఇక ఈగల్ సినిమా విషయానికొస్తే.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించగా.. వివేక్ కూచిబోట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: