ఆ తప్పే బాలయ్యకు శాపంగా మారిందా..?

Divya
టాలీవుడ్ లో నందమూరి హీరోగా బాలయ్య మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ నట వారసుడిగా కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తండ్రి సహకారంతోనే కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ తర్వాత తనకంటూ ఒక సొంత బ్రాండ్ ని ఏర్పరచుకున్నారు బాలయ్య. మాస్ లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా పేరు సంపాదించారు. ఇలాంటి క్రమంలోనే బాలయ్య చేసిన సినిమాలన్నీ కూడా మాస్ సినిమాలుగా ప్రేక్షకులను బాగా అలరించాయి.. ముఖ్యంగా డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో చేసిన సినిమాలన్నీ కూడా వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకున్నాయి.

అలాంటి క్రమంలోనే మిగతా హీరోలు అన్ని రకాల జోనర్ లను టచ్ చేయగా బాలయ్య మాత్రం కేవలం యాక్షన్ మాస్ సన్నివేశాలు ఫ్యాక్షన్ డ్రాప్ సినిమాలను ఎక్కువగా చేశారు. దీనివల్ల చాలామంది ఆడియన్స్ బాలయ్య సినిమాలను చూడడం మానేశారు. నెమ్మదిగా ఫ్యామిలీ ఆడియన్స్ సైతం వెంకటేష్ నాగార్జున వంటి సినిమాలను చూడడం మొదలుపెట్టారు.. అందువల్లే బాలయ్యకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి తగ్గిపోయిందని చెప్పవచ్చు. అలా థియేటర్లకు వెళ్లి చూడడం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మానేశారు.


అందువల్లే బాలయ్య సినిమా ఎంత విజయాన్ని అందుకున్న కలెక్షన్స్ మాత్రం పెద్దగా వచ్చేవి కావు. ఇది బాలయ్య కెరియర్ లో ఒకానొక సమయంలో భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు.బాలయ్య కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ని క్లాస్ ఆడియన్స్ ని తన సినిమాలకు రప్పించేలా చేస్తే కలెక్షన్స్ మరొక రేంజ్ లో ఉండేవి కానీ బాలయ్య అలాంటివి పట్టించుకోకుండా కేవలం తన అభిమానులను మాత్రమే ఆనందపరిచేలా చేస్తూ ఉంటారు. అందుకే ఎక్కువగా వైలెన్స్ మాస్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దీని వల్ల బాలయ్య ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నప్పటికీ ఇతర వర్గం ప్రేక్షకులు మాత్రం ఈయన సినిమాలు చూడడానికి పెద్దగా ఇష్టపడలేదు. చివరిగా భగవంత్ కేసరి సినిమాతో  గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాన్ని తెలిసి బాగానే పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: