యాత్ర-2 చూస్తే ఓట్లు వెయ్యరు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఇటీవల కాలంలో బయోపిక్ సినిమాలకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగా బయోపిక్లను తెరకెక్కిస్తూ ఇక ఆయా సినిమాలతో సూపర్ హిట్లు కొడుతున్నారు ఎంతో మంది దర్శక నిర్మాతలు. ఈ క్రమంలోనే గతంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర అనే సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ గా యాత్ర 2 మూవీ రాబోతుంది. మహి వి రాఘవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు మంచి బుకింగ్ కూడా ఉన్నాయట. మరీ ముఖ్యంగా వైసిపి అధికారంలో ఉన్న ఏపీలో బుకింగ్స్ భారీ స్థాయిలోనే ఉన్నాయని నైటిజన్స్ కామెంట్లు చేస్తున్నారూ. ఇక ఆంధ్రాలో ఎలక్షన్ హీట్ నడుస్తున్న నేపథ్యంలో   ఇక ఇప్పుడు యాత్ర 2 మూవీ అటు జగన్ కి ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఎంతో మంది ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉందని ఒక టాక్ కూడా ఆ ఏపీలో వినిపిస్తోంది. ఈ క్రమంలోనే యాత్ర 2 సినిమా గురించి డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 హీరోని దృష్టిలో పెట్టుకొని మనం సినిమాలు రాయలేము అంటూ చెప్పుకొచ్చాడు. యాత్ర సినిమా రియల్ పొలిటిషియన్ గురించి కాకపోయి ఉంటే మరింత బెటర్ రిజల్ట్ వచ్చేది అంటూ డైరెక్టర్ అభిప్రాయపడ్డాడు. అయితే యాత్ర అనే కథ వైయస్సార్ వల్లే పుట్టింది అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఇక సినిమాల వల్ల ఒక్క ఓటు కూడా పడదు అంటూ మహీ వి రాఘవ్ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే వైయస్సార్ ను ఇష్టపడే వాళ్ళలో సగం మంది ఈ సినిమా చూసిన బాహుబలి రేంజ్ కలెక్షన్స్ వస్తాయని వెల్లడించాడు. ఓటర్లు అనేవాళ్ళకి వాళ్ల లెక్కలు వాళ్లకు ఉంటాయి. సినిమా చూసే సమయంలో ఉన్న భావన బయటకు వెళ్లాక ఉండదు. ఎన్నికల సమయంలో సినిమాలకు అంతో ఎంతో డిమాండ్ ఉంటుందని.. అందుకే ఇలాంటి సమయంలో రిలీజ్ చేస్తామని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలు చూసి మాత్రం ఏ ఒక్కరు ఓటు వేయరు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: