కమల్ హాసన్ చేయాల్సిన సినిమా.. విజయ్ దగ్గరికి!

Anilkumar
కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే కదా. ఎవరూ ఊహించని విధంగా తన పార్టీ పేరును అధికారికంగా అనౌన్స్ చేసి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇక విజయ్ రాజకీయాల్లోకి రావడంతో సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం తన 68వ సినిమా 'గోట్' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వెంకట్ ప్రభు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కేవలం ఒకే ఒక్క సినిమా చేసి విజయ్ పూర్తిగా సినిమాలకు దూరం కాబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన లాస్ట్ మూవీ విషయంలో రోజుకో వార్త కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో దళపతి విజయ్ లాస్ట్ సినిమా ఉంటుందని, ఈ ప్రాజెక్టుని కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే న్యూస్ వచ్చింది. నిజానికి 'తునివు' తర్వాత వినోద్ తనకు బాగా నచ్చిన ఒక కథను కమలహాసన్ కి వినిపించాడు. ఈ ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్లాలని అదే స్క్రిప్ట్ పై ఫుల్ టైమ్ వర్క్ చేసాడు. కానీ కమల్ హాసన్ ఇప్పటికే మణిరత్నం ప్రొజెక్ట్, కల్కి, భారతీయుడు 2.. ఇలా వరుస సినిమాలకు కమిట్ అయ్యారు. దాంతో ఇవన్నీ వినోద్ ప్రాజెక్టుపై ప్రభావం చూపాయి. కమల్ హాసన్ ఇమేజ్ కి సరిగ్గా సరిపోయేలా వినోద్ ఆయన కోసం ఓ పొలిటికల్ సబ్జెక్ట్ ని రెడీ చేశారు. ఇక ఇప్పుడు విజయ్ చేతికి ఈ స్క్రిప్ట్ వెళ్లిందని టాప్ వినిపిస్తోంది.

ఇప్పటికే విజయ్ - వినోద్ మధ్య డిస్కషన్స్ కూడా జరిగాయట. విజయ్ లాస్ట్ మూవీ ఈ డైరెక్టర్ తోనే ఉండే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్ కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతని కంటే ముందు కార్తీక్ సుబ్బరాజ్ విజయ్ చివరి సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడని న్యూస్ వచ్చింది. మరి ఈ ఇద్దరిలో విజయ్ ఎవరితో సినిమా చేస్తారనేది తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక విజయ్ 'గోట్' సినిమా విషయానికొస్తే.. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‍గా నటిస్తున్నారు. జయరాం, మిక్ మోహన్, ప్రభు దేవ, యోగిబాబు కీరోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది జూన్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: