యానిమల్ మూవీపై ఆ స్టార్ హీరో ఇచ్చిన రివ్యూకి .. సందీప్ రెడ్డి ఫిదా అయ్యాడట.

praveen
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బోల్డ్ కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు అనే విషయం తెలిసిందే.  ఇక తనదైన శైలిలో సినిమాలు తీస్తూ సూపర్ హిట్లను కూడా సొంతం చేసుకుంటున్నారు సందీప్ రెడ్డి. ఇప్పటివరకు ఆయన చేసింది కేవలం మూడు సినిమాలు మాత్రమే ఇక ఈ మూడు సినిమాలు కూడా ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించాయి. చిన్నచితక హీరోగా ఉన్న విజయ్ దేవరకొండ తో అర్జున్ రెడ్డి అనే ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ మూవీని చేశాడు. ఇక ఈ మూవీ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అని చెప్పాలి. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషనల్ విజయాన్ని కూడా సాధించింది.

 అయితే ఆ తర్వాత ఇదే మూవీని అటు హిందీలో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేస్తే ఇక అక్కడి ప్రేక్షకులు కూడా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయిపోయారు. కబీర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇటీవల పాన్ ఇండియా మూవీగా యానిమల్ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయ్యింది. రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మికమందన్న హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు. ఇక యానిమల్ మూవీ తో మరోసారి తనదైన మార్క్ దర్శకత్వంతో ప్రేక్షకులను మెప్పించ గలిగాడు సందీప్ రెడ్డివంగా. అదే సమయంలో ఈ సినిమాపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి.

 అయితే చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే యానిమల్ మూవీ పై ఒక స్టార్ హీరో ఇచ్చిన రివ్యూ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చాడు. యానిమల్ సినిమాపై బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఇచ్చిన రివ్యూ ను మరిచిపోలేను అంటూ తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాను చూసిన తర్వాత రణబీర్ నాకు కాల్ చేసి దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. అంతేకాదు ఆ తర్వాత కూడా ఒక సుదీర్ఘమైన మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ లో సినిమా గురించి చాలా విషయాలు ప్రస్తావించారు. ఆ మెసేజ్ ని నాలుగు సార్లు చదువుకొని ఎంతగానో సంతోషపడ్డాను అంటూ సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: