గుంటూరు కారం ఫ్లాప్ ఫై.. ఎస్వీ కృష్ణారెడ్డి ఏమన్నాడో తెలుసా?

praveen
ఇటీవల కాలం లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో చిన్న సినిమాలకే ప్రేక్షకులు పెద్దపీట వేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. రొటీన్ రొడ్డ కొట్టుడు కథల తో వస్తున్న సినిమాలను పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే ఆయా సినిమాలు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన.. స్టార్ హీరోలు నటిస్తున్న.. ఇక కమర్షియల్ సినిమాలు ఇటీవల కాలం లో హిట్టు కొట్ట లేకపోతున్నాయి అన్న విషయం తెలిసిందే  అదే సమయం లో ఎలాంటి అంచనాలు లేకుండా వస్తున్న సినిమాలు మాత్రం సూపర్ డూపర్ విజయాన్ని సాధిస్తున్నాయి.

 అయితే సంక్రాంతికి విడుదలైన సినిమాల విషయం లో ఇదే జరిగింది. ఏకంగా భారీ అంచనాల మధ్య మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం మూవీ విడుదల అయింది. అయితే ఈ మూవీ విడుదలైన నాటి నుంచి కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ఎందుకో చెప్పుకోదగ్గ వసూళ్లను మాత్రం సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే డైరెక్టర్ త్రివిక్రమ్ రొటీన్ కథను మహేష్ బాబుతో తీశాడు అంటూ ఎంతో మంది విమర్శలు కూడా చేశారు. అయితే ఇక ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన గుంటూరు కారం ఫ్లాప్ కావడంపై డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు.

 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి గుంటూరు కారం సినిమా రిజల్ట్ గురించి మాట్లాడాడు. హీరోకు అనుకూలంగా సినిమాలు చేయాలనుకున్నప్పుడే అసలు సమస్య వస్తుంది. నేను చేసిన టాప్ హీరో, వజ్రం సినిమాలు కూడా అందుకే ప్రేక్షకాదరణకు నోచుకోలేకపోయాయి. ఇక ఇటీవలే గుంటూరు కారం సినిమా కూడా హీరో స్టార్ డం కి తగ్గట్లుగా తెరకెక్కించేందుకు తంటాలు పడటంతోనే తేడా కొట్టింది  ఎప్పుడైనా సరే కథను నమ్ముకునే మూవీ తీయాలి అంటూ ఎస్ వి కృష్ణారెడ్డి సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: