ప్రభాస్ 'కల్కి'.. నుండి అదిరిపోయే అప్డేట్..!

Anilkumar
మహానటి మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898AD'. సైన్స్ ఫిక్షన్ కథాంశంతో హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినిదత్ చిత్రాన్ని సుమారు 550 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూపించని ఓ సరికొత్త భవిష్యత్ ప్రపంచాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో విశ్వ నటుడు కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, 

దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి టాప్ స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఇక గత కొద్ది రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, నాచురల్ స్టార్ నాని సైతం ఈ సినిమాల్లో భాగం అవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు కల్కి కి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ఏకంగా ఐదు విభిన్న తరహా పాత్రలో కనిపిస్తారట. శ్రీమహావిష్ణువు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, కల్కి.. ఇలా ఐదు పాత్రల్లో ప్రభాస్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. అందులో మొదటి భాగం 'కల్కి 2898AD' కాగా రెండో భాగం 'కల్కి3102BC' అనే పేరుతో రానున్నట్లు సమాచారం.

రెండో భాగాన్ని 2027లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక పార్ట్-1 అయిన 'కల్కి2898AD' సినిమాని మే 9, 2024 వరల్డ్ వైడ్ గా సుమారు 25 పైగా భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్. ఇక 'కల్కి' షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరి కొద్ది రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. భారీ గ్రాఫిక్స్, VFX తో హాలీవుడ్ సినిమాలను మించేలా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తీర్చిదిద్దుతున్నారు. మరోవైపు ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'రాజా సాబ్' కూడా ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: