విడాకుల తర్వాత హీరోయిన్ గా బిజీ అవుతున్న మెగా డాటర్

Anilkumar
చైతన్య జొన్నలగడ్డని ప్రేమించి పెళ్లి చేసుకున్న నిహారిక ఇటీవలే అతనితో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు కు చెందిన చైతన్య జొన్నలగడ్డతో 2020లో డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చాలా ఘనంగా జరిగింది. ఓ రెండేళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అయ్యాయి. వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ వేడుకల్లో కూడా చైతన్య ఎక్కడా కనిపించకపోవడంతో రూమర్స్ మరింత పెరిగాయి. ఫైనల్‌గా విడాకుల గురించి వీరిద్దరూ సోషల్ మీడియాలో అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తమ ఇష్టానుసారంగానే విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

విడాకుల తర్వాత నిహారిక హీరోయిన్ గామళ్ళీ బిజీ అవుతోంది. తాజాగా ఈమె హీరోయిన్ ఓ సినిమాకి సెలెక్ట్ అయింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. చాలా కాలం తర్వాత మెగా డాటర్ మల్లి సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. 'మద్రాస్ కారన్' అనే మలయాళ సినిమాల్లో నిహారిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో షేన్ నిగమ్ తో కలిసి రొమాన్స్ చేయబోతోంది. మూవీ టీం నిహారికకు వెల్కమ్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
నిహారిక ఏ విషయం అయినా సూటిగా చెబుతుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' పెళ్లయ్యాక కూడా నటన కొనసాగించాలని అనుకున్నప్పటికీ అందుకు అత్తింటి వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పింది. అంతేకాదు పెళ్ళైతే నటన ఎందుకు మానేయాలి' అని ఇంటర్వ్యూలో తెలిపింది. అందుకే పెళ్లి తర్వాత కూడా నిర్మాతగా మీడియం బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ ల నిర్మించింది. రీసెంట్ గా 'డెడ్ పిక్సెల్' అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. మంచి మనోజ్ హీరోగా నటిస్తున్న 'వాట్ ద ఫిష్' సినిమాలో నిహారిక హీరోయిన్. ఇదే విషయాన్ని తెలియజేస్తూ రీసెంట్గా నిహారిక బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: