హైపర్ ఆది వల్లే అనసూయ జబర్దస్త్ వదిలేసిందా.. నిజం బయటపడిందిగా?

praveen
యాంకర్ అనసూయ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తెలుగు బుల్లితెరపై సెన్సేషనల్ కామెడీ షో గా గుర్తింపును సంపాదించుకున్న జబర్దస్త్ అనే షోలో యాంకర్ గా చేసి తన వాక్చాతుర్యంతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక అందం అభినయంతో కూడా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా మరింత దగ్గర అయ్యింది. దాదాపు పదేళ్లపాటు ఈ షోలో యాంకరింగ్ చేసిన అనసూయ కోట్లాదిమంది.. బుల్లితెరప్రేక్షకుల హృదయాలకు చేరువైంది అన్న విషయం తెలిసిందే.

 అయితే కేవలం జబర్దస్త్ షో తోనే తన కెరీర్ కు పులిస్టాప్  పెట్టకుండా సినిమాలలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.  అయితే అక్కడ తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని వరుసగా అవకాశాలు అందుకుంది అని చెప్పాలి. రంగస్థలం లాంటి ఒక గొప్ప సినిమాలో రంగమ్మత్త అనే కీలకపాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు రంగమ్మత్తగా మారిపోయింది ఈ జబర్దస్త్ యాంకర్. అయితే ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా జబర్దస్త్ నుంచి యాంకర్ గా తప్పుకుంది అన్న విషయం తెలిసిందే. అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకున్న సమయంలో ఎన్నో రూమర్స్ తెరమీదకి వచ్చాయి.

 జబర్దస్త్ లో టాప్ టీమ్ లీడర్ గా కొనసాగుతున్న హైపర్ ఆది కారణంగానే అనసూయ ఇక జబర్దస్త్ ని వదిలేసారు అని ఎంతో మంది చర్చించుకున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో హైపర్ ఆదికి ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. జోర్దార్ సుజాత యూట్యూబ్ ఛానల్ హైపర్ ఆది ఇంటర్వ్యూ కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. అయితే చివర్లో అనసూయ మీ వల్లే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయింది అని అంటున్నారు.. ఎంతవరకు నిజం అని సుజాత హైపర్ ఆదిని అడుగుతుంది. వెంటనే హైపర్ ఆది మొహం మాడిపోతుంది. దీంతో ఏదో సీరియస్గా సమాధానం చెబుతాడు. అయితే ఆది ఏం సమాధానం చెప్పాడు అన్నది మాత్రం పూర్తి ఎపిసోడ్ వచ్చిన తర్వాత తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: