స్టైల్ మార్చిన శేఖర్ కమ్ముల.. త్రివిక్రమ్ ని ఫాలో అవుతున్నాడట?

praveen
ఏ ఫిలిం బై శేఖర్ కమ్ముల.. ఈ పేరు చూడగానే ప్రేక్షకులు అందరిలో కూడా ఆ మూవీ ఎలా ఉంటుంది అనే విషయంపై ఒక క్లారిటీ వస్తుంది. నాచురాలిటీకి దగ్గరగా ఇక ఫీల్ గుడ్ మూవీ గా ఉంటుంది అని అందరూ అంచనా వేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల స్టార్ డైరెక్టర్గా ఎదిగినప్పటికీ అందరిలా కమర్షియల్ హంగుల జోలికి పోకుండా.. తనదైన శైలిలో న్యాచురాలిటీకి దగ్గరగా ఉండే సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలవుతూ  ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్లనూ సాధిస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 అయితే ఆయన టేకింగ్ పై విమర్శలు వచ్చిన ప్రశంసలు వచ్చిన పట్టించుకోకుండా.. తనతైన డైరెక్షన్ తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు మొదటిసారి తన తీరునూ మార్చుకోబోతున్నాడట శేఖర్ కమ్ముల. ఏకంగా ధనుష్ మూవీ కోసం తనను తాను పూర్తిగా మార్చుకుంటున్నాడు అన్న ఒక టాక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. అలవాటు లేని పనులన్నీ కూడా ఒకేసారి చేయడానికి రెడీ అవుతున్నాడు శేఖర్ కమ్ముల. సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు ఉండవు. కానీ ధనుష్ తో తెరకెకిస్తున్న మూవీలో మాత్రం సాలిడ్ ఫైట్ సీన్స్ ఉంటాయట.

 ధనుష్, నాగార్జునలు ఈ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇక ఈ మూవీకి దారావి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు అని తెలుస్తుంది. ముంబైలోని ప్రధానమైన మురికివాడ. ఇక ఈ ఏరియాకు మాఫియాకు లింక్ చేస్తూ శేఖర్ కమ్ముల ఒక కథను రాసుకున్నాడట. ఏకంగా ధనుష్ నాకు మల్టిస్తారని ఫుల్ లెన్త్ మాఫీయాను తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఇక ధనుష్ మూవీ విషయంలో ఏకంగా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైల్ ఫాలో అవుతున్నాడట శేఖర్ కమ్ముల.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: