మెగాస్టార్ చిరంజీవి.. తండ్రితో కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా?

praveen
మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఎందుకంటే దాదాపు గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ  ఇచ్చి తన నటనతో డాన్స్లతో సరికొత్త ట్రెండు సృష్టించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. ఇప్పటివరకు 150కి పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇక 60 ప్లస్ వయస్సులో కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

 అయితే ఇక చిరంజీవి మెగా అనే ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా ఎదిగారు అని చెప్పాలి. ఇక ఇంకొంతమంది స్పెషల్ క్యారెక్టర్లలో కూడా కనిపించారు. అయితే ఇక మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొనిదెల వెంకటరావు కూడా ఒక సినిమాలో నటించారట. అది కూడా మెగాస్టార్ హీరోగా ఉన్న సినిమాలోనే. ఇక ఆయన తండ్రి వెంకట్ రావు కూడా ఒక కీలకపాత్రలో కనిపించాడట. ఇప్పుడు వరకు మెగాస్టార్ తండ్రి కానిస్టేబుల్ అని మాత్రమే అందరికి తెలుసు. కానీ బాపు దర్శకత్వంలో వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు అనే సినిమాలో నటించారట కొణిదెల వెంకటరావు.

 మెగాస్టార్ చిరంజీవి, పూర్ణిమ భాగ్యరాజ్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక అల్లు రామలింగయ్య మరో ముఖ్యపాత్రలో కనిపించారు. అయితే ఇందులో మంత్రి రోల్ కి సూట్ అయ్యే పాత్ర కోసం దర్శకుడు ఎంతో మందిని అప్రోచ్ అయ్యారట. కానీ ఎవరు పాత్రికు సరిపోతారని అనిపించలేదు. చివరికి రామలింగయ్య చిరంజీవి తండ్రి కూడా ఉన్నారు కదా.. ఒకసారి స్క్రీన్ టెస్ట్ చేద్దాం అని చెప్పారట. దీంతో స్క్రీన్ టెస్ట్ చేయగా ఇక చిరు తండ్రి వెంకట్ రావు మంత్రి పాత్రకు అద్భుతంగా సెట్ అయ్యారట. దీంతో  ఆయనను ఆ పాత్ర కోసం తీసుకున్నారట. అయితే చిరంజీవి వెంకట్రావుకి మధ్య ఎలాంటి సీన్స్ లేకపోయిన.. తండ్రి కొడుకులు ఒకే సినిమాలో నటించినట్లు అయింది అని చెప్పాలి. 1983 లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: