రష్మిక - విజయ్ మధ్య.. అంత ఏజ్ గ్యాప్ ఉందా?

praveen
విజయ్ దేవరకొండ, రష్మిక మందన.. ఈ జంట గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఇక తరచూ ఈ జంట పేరు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది. చలో అనే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా  ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.  తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. పుష్ప సినిమా సూపర్ హిట్ తో పాన్ ఇండియా హీరోయిన్గా కూడా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

 మరోవైపు ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. కాగా ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఇద్దరు గీతాగోవిందం అనే మూవీలో మొదటిసారి కలిసిన నటించారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ మూవీలోను నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్లుగానే అప్పుడప్పుడు ఈ ఇద్దరు ఏకంగా మాల్దీవ్స్ లో ప్రత్యక్షమవడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుంది. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పెళ్లి చేసుకోవట్లేదు అంటూ ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వీరిపై వస్తున్న వార్తలు మాత్రం ఆగడం లేదు.

 అయితే విజయ్ దేవరకొండ కి రష్మిక మందన్నకి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇద్దరి మధ్య దాదాపు ఏడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది అన్నది తెలుస్తోంది. 1989 మే 9న జన్మించాడు విజయ్ దేవరకొండ. ఇక ప్రస్తుతం విజయ్ వయసు 34 సంవత్సరాలు. ఇక రష్మిక మందన్న 1996 ఏప్రిల్ 5వ తేదీన జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు. దీనిని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏకంగా ఏడేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అయినప్పటికీ ప్రేమకి వయసుతో సంబంధం లేదు అంటూ తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు ఈ జంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: