'పఠాన్' సినిమాతో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మోత మోగించిన సిద్ధార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్ తో తీసిన 'ఫైటర్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్ డే నంబర్‌లను తీసుకురావడంలో విఫలమైంది. ఇప్పుడు అలా ఎందుకు అయిందో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపాడు.యుద్ధంలో ఓడిపోయాక ఎందుకు ఓడిపోయామో విశ్లేషించుకున్నా ప్రయోజనం ఉండదు. 'ఫైటర్' సినిమా ఒక ఓటమి పాలైన జెట్. బాక్సాఫీస్ అనే యుద్ధంలో ఈ సినిమా ఓటమి పాలైంది. అంతా ముగిసిపోయిన తర్వాత ఇప్పుడు విశ్లేషించుకుని ఏం లాభం? ఫైటర్ వైఫల్యంపై తరణ్ ఆదర్శ్ లాంటి క్రిటిక్ కూడా ఆవేదన వ్యక్తం చేసారు.
ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో తనని తాను డిఫెండ్ చేసుకుంటూ ఫైటర్ సినిమా వైఫల్యాన్ని విశ్లేషించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. రిగ్రెట్ కూడా ఫీలయ్యాడు. ఇటువంటి కంటెంట్ ఎంపిక చేసుకుని తప్పు చేసానా? అని కలతకు ఆయన గురయ్యాడు. 90 శాతం మంది విమానాల్లో ప్రయాణించని భారతీయ ప్రేక్షకులకు ఫైటర్ పూర్తిగా కొత్త తరహా సినిమా అని విశ్లేషించారు. ఇక దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. 90శాతం ప్రజలు ఫైటర్ ని వీక్షించేందుకు ఆసక్తిగా లేకపోవడమే ఈ వైఫల్యానికి కారణమని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇతని స్టేట్మెంట్ ఇండియన్స్ కి కించపరిచేలా ఉండంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఫైటర్ సినిమా జనవరి 25 న థియేటర్లలో భారీగా విడుదలైంది. కానీ ప్రారంభ రోజున ఆశించిన స్థాయిలో ఈ సినిమా వసూళ్లను సాధించలేదు. ఈ మూవీలో హృతిక్ రోషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారిగా నటించారు. దీపిక లాంటి గ్లోబల్ హీరోయిన్ కూడా నటించారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ మూవీ తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఊహించని వైఫల్యాన్ని చవి చూసింది. తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమా బాక్సాఫీస్ వైఫల్యంపై విశ్లేషించారు. 90శాతం మంది విమానాల్లో ప్రయాణించని భారతీయ ప్రేక్షకులకు ఫైటర్ పూర్తిగా కొత్త జానర్ సినిమా అని అనడంతో ఈ కామెంట్ తెగ వైరల్ అయిపోయింది.అతని మాట బట్టి చూస్తే అతను సినిమా తీయడం తప్పు కాదు జనాలు అతని సినిమాని అర్ధం చేసుకోకపోవడం తప్పు అన్నట్లు ఉంది.