టాలీవుడ్ హిస్టరీలో.. 92 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన హనుమాన్?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన సినిమా ఒక్కటే. అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ మూవీ సెన్సేషనల్ విజయాన్ని సాధించింది. స్టార్ హీరోలతో పోటీపడి మరి సంక్రాంతి బరిలో దిగిన ఈ మూవీ సంక్రాంతి పందెంలో గెలిచిన కోడిపుంజుగా మారిపోయింది అని చెప్పాలి. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ మూవీ. ఇక వసూళ్ల విషయంలో కూడా ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికీ ఇంకా ఈ సినిమాకు  థియేటర్లలో భారీగా వసూళ్లు వస్తున్నాయ్.

 ఏకంగా 300 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది ఈ మూవీ. అయితే ఇప్పటికే సంక్రాంతికి విడుదలై ఇక భారీ వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా చేరిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల చిన్న హీరో అయినా తేజ టాలీవుడ్ హిస్టరీలోనే 92 ఏళ్ళ అరుదైన రికార్డును బద్దలు కొట్టేశాడు. 92 ఏళ్ళ టాలీవుడ్ హిస్టరీలో  సంక్రాంతికి విడుదలై అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది హనుమాన్ మూవీ. ఈ మూవీ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 278 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి మేకర్స్ ఒక పోస్టర్ ను విడుదల చేశారు.

 దీంతో తేజ సజ్జ రేంజ్ ఒక్క లెవెల్ కి వెళ్ళిపోయింది అంటూ అభిమానులు అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇండియన్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంలో ఇక ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మూవీ తర్వాత ప్రశాంత వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా భార్య రేంజ్ లోనే అంచనాల పెరిగిపోయాయి. ఇక హనుమాన్ మూవీకి సీక్వల్ గా జై హనుమాన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. కాగా హనుమాన్ మూవీలో అమృత అయ్యర్ తేజ సజ్జ సరసన హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో కనిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: