ఫ్లాప్ పడ్డా భలే ఛాన్స్ కొట్టేసింది..!

shami
కొందరు భామలకు ఫ్లాపులు పడినా సరే అవకాశాల విషయంలో డోకా ఉండదు. అలాంటి వారిలో ఇప్పుడు శ్రద్ధ శ్రీనాథ్ కూడా ఉంది. జెర్సీ సినిమాలో నాని సరసన నటించిన అమ్మడు ఆ తర్వాత ఆది సాయి కుమార్ తో ఒక మూవీ చేసింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమాలో నటించింది అమ్మడు. ఆ సినిమాలో శ్రద్ధ నటన బాగున్నా సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు.
అయితే ఫ్లాప్ పడింది కదా అని కాకుండా అమ్మడికి మరో స్టార్ హీరో చాన్స్ వచ్చింది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాను కె.ఎస్ బాబీ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్లాప్ పడ్డా కూడా మరో సూపర్ సినిమా ఛాన్స్ పట్టేసింది.
బాలకృష్ణ సినిమాలో అవకాశం అంటే అమ్మడికి లక్ తగిలినట్టే లెక్క. బాబీ డైరెక్షన్ లో సినిమా కాబట్టి బాక్సాఫీస్ లెక్కలు బాగానే ఉంటాయి. సో అమ్మడి ఖాతాలో హిట్ పడ్డది అంటే మాత్రం శ్రద్ధ శ్రీనాథ్ మళ్లీ తెలుగులో తిరిగి ఫాం లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కన్నడలో కూడా తన టాలెంట్ చూపిస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్న శ్రద్ధ శ్రీనాథ్ తెలుగులో వరూ సినిమాలు చేయాలని అనుకుంటుంది. ఐతే అమ్మడు సైంధవ్ ఫ్లాప్ అయినా కూడా బాలయ్య సినిమా లో నటించే అవకాశం రావడం లక్కీ అని చెప్పొచ్చు. ఈ సినిమాను ఈ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో భారీ యాక్షన్ సినిమాగా వస్తుంది. ఈ సినిమా తో కూడా బాలయ్య తన సక్సెస్ ఫాం కొనసాగించాలని చూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: